మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశం: స్టేట్ కో పొడిగింపు: ఎప్పటివరకంటే? గవర్నర్ గెజిట్‌పై

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై తలెత్తిన న్యాయపరమైన చిక్కుముడులు ఇంకా వీడలేదు. గవర్నర్ గెజిట్ జారీ చేయడంతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైందని భావించినప్పటికీ.. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఏపీ హైకోర్టులో పిటీషన్లను దాఖలు చేయడంతో మళ్లీ మొదటికి వచ్చింది ఈ వ్యవహారం.

స్టేటస్‌ కోను ఎత్తేయాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఙప్తిని హైకోర్టు తిరస్కరించింది. స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసిందని, దానిపై విధించిన స్టేటస్ కోను ఎత్తేయాలంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ఆయన వాదనలు సబబుగా లేదని భావించారు. మరింత విస్తృతంగా విచారణ చేపట్టాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు. స్టేటస్ కోను 27 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.

AP High Court extedned Status Quo on Governor Gazette to Three capital issue

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌‌పై అమరావతి పరిరక్షణ సమతి ప్రతినిధులు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశపూరకంగా తమను అన్యాయం చేస్తోందంటూ అమరావతి ప్రాంత రైతుల తరఫున పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై స్టేటస్ కో ఇచ్చింది. ఈ గడువు శుక్రవారం నాటితో ముగియడంతో మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది, పరిరక్షణ సమితి తరఫు న్యాయవాది వాదలను న్యాయమూర్తులు ఆలకించారు.

అనంతరం స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటీషన్లపై విచారణ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఆన్‌లైన్ విధానంలో విచారణ చేపట్టాల్సి రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నేరుగా విచారణ నిర్వహించాలని పలువురు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఙప్తి చేశారు. న్యాయవాదుల విజ్ఙప్తి పట్ల హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఈ నెల 27వ తేదీ నాటికి స్పష్టమౌతుంది.

Recommended Video

    Andhra Pradesh : పంద్రాగస్టు వేడుకలు Vijayawada లోనే, చురుగ్గా ఏర్పాట్లు!! || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+