అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స‌మ‌యం కావాలి : హైకోర్టు విభ‌జన పై సుప్రీంకు..!

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి హైకోర్టు విభ‌జ‌న‌..జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుండి విడి విడిగా కోర్టులు..విజ‌య‌వాడ నుండి ఏపి హైకోర్టు వంటి అంశాల పై హైకోర్టుకు చెందిన ఏపి న్యాయ‌వాదులు ఆందోళ‌న చెందుతున్నారు. క‌నీస స‌మ‌యం ఇవ్వ‌కుండా హ‌డావుడిగా విభ‌జ న పై సుప్రీంకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీని పై ఏపి సుప్రీంకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసి అత్యవసరంగా వినాలని వారు అభ్యర్థించనున్నారు...

ఏపి న్యాయ‌వాదులు ఆందోళ‌న

ఏపి న్యాయ‌వాదులు ఆందోళ‌న

హైకోర్టు విభ‌జ‌న అనివార్యం అయిన‌ప్ప‌టికీ...క‌నీస సౌక‌ర్యాల పై దృష్టి పెట్టకుండా..త‌మ‌కు ఎటువంటి స‌మ‌యం ఇవ్వ‌కుండా హైకోర్టును విభ‌జించ‌టం పై ఏపి న్యాయ‌వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీని పై సుప్రీంకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసి అత్యవసరంగా వినాలని వారు అభ్యర్థించనున్నారు. హైకోర్టులోని ఏపీ న్యాయవాదు ల సంఘం అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని జరిపి, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మెజారిటీ సభ్యులు ఆమోదించారు

మెజారిటీ సభ్యులు ఆమోదించారు

హైకోర్టులో ఏపీ న్యాయవా దుల సంఘం అధ్యక్షుడు కేబీ రామన్నదొర ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించారు. దీంతో ఏపీ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు టి.సీతారాం, కోశాధికారి బీవీ ఆపర్ణలక్ష్మి ఢిల్లీకి వెళ్లారు. శనివారం సుప్రీంకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసి అత్యవసరంగా వినాలని వారు అభ్యర్థించనున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన అనివార్యం అయినప్పటికీ... ఆకస్మికంగా మూడు పనిదినాల్లోనే విభజించి ఏపీకి వెళ్లాలంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేయడంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇంత స‌డ‌న్ గా కోర్టు విభ‌జించాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నించారు..

వ‌స‌తులు ఏవి..

వ‌స‌తులు ఏవి..

హైకోర్టు ఏర్పాటుకు తలపెట్టిన తాత్కాలిక భవనం ఇంకా నిర్మాణంలోనే ఉందని, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని న్యాయ‌వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని పలువురు లాయర్లు అభిప్రాయపడ్డారు. నోటిఫికేషన్‌ జారీచేశాక 2 నుంచి 3 నెలల గడువు ఇచ్చి ఉంటే... అక్కడ భవనం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని, ఈలోగా న్యాయవాదులు అక్కడ నివాసం, ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు తగిన సమయం లభించేదని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సుప్రీం ను ఆశ్ర‌యించ‌టం తో అక్క‌డ వ‌చ్చే స్పంద‌న‌కు అనుగుణంగా త‌దుప‌రి అడుగులు ప‌డే అవ‌కాశం ఉంది..

English summary
AP lawyers want time for shifting to Viayawada form hyderabad. They decided to filr house motion perition in supreme court on satur day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X