టూరిస్ట్ మినిస్టర్ అన్నారుగా.. 21వేల కోట్ల పెట్టుబడులు తెచ్చా- రోజా ప్రకటన..

ఏపీలో పర్యాటక మంత్రిగా కంటే పర్యాటకురాలిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్న మంత్రి ఆర్కే రోజా.. తాజాగా వైజాగ్ లో తన శాఖకు వచ్చిన పెట్టుబడులను ఇవాళ సగర్వంగా ప్రకటించారు.

ఏపీలో పర్యాటకశాఖ మంత్రిగా ఉంటూ కొత్త పరిశ్రమలు తీసుకురాలేకపోగా.. ఉన్న వాటిని కూడా ప్రోత్సహించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్కే రోజా (RK ROJA)కు వైజాగ్ పెట్టుబడుల సదస్సు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె నిర్వహిస్తున్న పర్యాటకశాఖకు దాదాపు 20 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఆమె ఇవాళ గతంలో తనపై ఎదురైన విమర్శలకు పెట్టుబడులతో సమాధానం ఇచ్చానని వెల్లడించారు.

వైజాగ్ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంపై ఇవాళ అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రోజా సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ సమ్మిట్ తో జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థం అవుతుందని రోజా తెలిపారు. గతంలో సమ్మిట్ లు పేపర్ల కు మాత్రమే పరిమితం అయ్యాయని, సమ్మిట్ కు వచ్చిన అంబానీ,అదానీలను చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని రోజా తెలిపారు. గోబెల్ ప్రచారం చేసిన వారికి ఇదొక చెంప పెట్టన్నారు.

ap minister rk roja counter with 21k crore investments to tourist minister comments

ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి అందరూ ముందుకొస్తున్నారని రోజా తెలిపారు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఏడాదిలో మెజారిటీ గ్రౌండ్ అయ్యేలా చూస్తామన్నారు. టూరిజం లో 129 ఎంవోయూలతో 21వేల 941 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రోజా వెల్లడించారు. దీనిద్వారా 41వేల500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోజా టూరిస్టా...?టూరిజం మినిస్టరా అని ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అన్నారు. గతంలో జనసేన నేత నాగబాబు ఆమెపై ఈ టూరిస్ట్ విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+