అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP SSC Results 2022: కాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్.. ఈ సారి మార్కులే.. ప్రకటన ఇస్తే అంతే సంగతులు...?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పది ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. వాస్తవానికి శనివారం రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. అదీ వాయిదా పడింది. కానీ దానిపై విపక్షాలు విమర్శలు చేశాయి. అనివార్య కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని ప్రభుత్వం స్పష్టంచేసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల కోసం www.results.bse.ap.gov.inలో చూడాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సారి గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు 6,21,799 మంది హాజరయ్యారు. కేవలం 25 రోజుల్లోనే రిజల్ట్ విడుదల చేస్తున్నారు. ఇటు 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది.

andhra pradesh ssc results to release monday. this time results are shown marks.

ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయని ప్రకటనలు చేసి ద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పాఠశాల విద్యాశాఖకు వినతి వచ్చాయి.

ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌-1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. టెన్త్‌ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

English summary
andhra pradesh ssc results to release monday. this time results are shown marks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X