ఆర్టీసీ యూనియన్ల స్ట్రైక్ నోటీసు.. ఏపీలో 22 తర్వాత పరిస్థితి ఏమిటో?

విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యం తీరును నిరసిస్తూ కార్మికులు రోడ్డెక్కనున్నారు. ఆ మేరకు 46 డిమాండ్లతో ఎన్ఎంయూ కార్మిక సంఘం నేతలు బుధవారం సమ్మె నోటీసు ఇచ్చారు. దానికి తోడు మరో 10 సంఘాలు కూడా గురువారం నాడు అదే బాట పట్టడంతో ఇక ఆర్టీసీలో సమ్మె తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇదివరకు సమ్మె నోటీసులిస్తే డిమాండ్లు నెరవెరుస్తామన్న హామీల పర్వం అటకెక్కింది. ఆదుకుంటామని చెబుతూనే యాజమాన్యం చేతులెత్తేస్తోంది. దాంతో మరోసారి సమ్మె సైరన్ మోగించారు ఆర్టీసీ కార్మికులు.

27 డిమాండ్లు.. 22 వరకు డెడ్ లైన్

27 డిమాండ్లు.. 22 వరకు డెడ్ లైన్

ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఇక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు బుధవారం నాడు సమ్మె సైరన్ మోగించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు నోటీసు అందించారు. అదే బాటలో గురువారం నాడు మరో గుర్తింపు సంఘమైన ఎంప్లాయిస్ యూనియన్ నేతలతో సహా మరో 10 సంఘాలకు చెందిన నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. వేతన సవరణ బిల్లులు చెల్లించడంతో పాటు 27 డిమాండ్లను పేర్కొంటూ వినతి పత్రం సమర్పించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి ఈ నెల 22వరకు గడువు విధించారు ఆయా సంఘాల నేతలు. ఒకవేళ యాజమాన్యం స్పందించని పక్షంలో రాష్ట్రమంతటా సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. బస్సులు రోడ్లపైకి రాకుండా సమ్మె ఉధృతం చేస్తామన్నారు.

22 తర్వాత ఏ క్షణమైనా బస్సులు బందేనా..?

22 తర్వాత ఏ క్షణమైనా బస్సులు బందేనా..?


ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు నోటీసులు అందజేసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. కార్మికులకు వెంటనే 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని తగ్గించడం, అద్దెబస్సులు పెంచడం.. తదితర ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. సీసీఎస్ కు చెల్లించాల్సిన దాదాపు 285 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేత దామోదర్ రావు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. అందులోభాగంగా శుక్రవారం నాడు రాష్ట్రమంతటా అన్నీ డిపోల్లో సమ్మె సన్నాహక ధర్నాలు చేపడతామని వెల్లడించారు.

తమ న్యాయమైన డిమాండ్ల పట్ల ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడం లేదనేది కార్మికుల ఆవేదన. ఇదివరకు పలుమార్లు యాజమాన్యంతో జరిపిన చర్యలు సఫలం కాలేదు. దాంతో మరోసారి సమ్మె బాట పడుతున్నామంటున్నారు కార్మిక సంఘాల నేతలు. డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, తద్వారా ఆర్టీసీని రక్షించే ప్రయత్నం చేయాలని కోరారు. ఒకవేళ యజమాన్యం స్పందించని పక్షంలో ఈ నెల 22 తర్వాత ఏ క్షణమైనా రాష్ట్రమంతటా బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించారు.

 హామీలు ఏమయ్యాయి..!

హామీలు ఏమయ్యాయి..!

ఇదివరకు డిమాండ్ల సాధన కోసం 2018, డిసెంబరులో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఆ సందర్భంలో ప్రభుత్వం దిగొచ్చి కార్మికులను బుజ్జగించే ప్రయత్నం చేసింది. సమ్మెకు వెళతామంటే వద్దంటూ.. డిమాండ్ల పరిష్కారానికి ఓకే చెప్పింది. ఆ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటివారంలో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘాల నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లలో ప్రధానమైన వేతన సవరణ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2003 నుంచి పెండింగులో ఉన్న బకాయిలను ఉగాది రోజున చెల్లిస్తామన్నారు. కానీ ఆ హామీని తుంగలో తొక్కారనేది కార్మిక సంఘాల నేతల వాదన. ఉగాది పండుగ అయిపోయి నెలరోజులు కావస్తున్నా.. ఇంతవరకు దాని ఊసే లేదు. దాంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు మరోసారి సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 22 వరకు డెడ్ లైన్ పెట్టిన కార్మిక సంఘాల నేతలు ఈసారి సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+