ఆర్టీసీ టికెట్లపై జీఎస్టీ బాదుడు..? ఆ యాప్స్ నుంచి బుక్ చేస్తేనే..
జీఎస్టీ.. ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అంతే. ఇక నుంచి పన్నును ముక్కు పిండి మరీ వసూల్ చేస్తారు. ప్రైవేట్ పోర్టల్ ద్వారా బుక్ చేస్తే చార్జీ తప్పదని ఆర్టీసీ తెలిపింది.ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, బుకింగ్ కౌంటర్లు, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ వర్తించదని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1 నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ అధికారులు కీలక సూచన చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఆర్టీసీ పోర్టల్, ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. లేదంటే 5 శాతం పన్ను వడ్డన తప్పుదు మరీ.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం ఎలాగో.. తమ పోర్టల్ ద్వారా కూడా బుక్ చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో సంస్థకు నేరుగా ఆదాయం రానుంది. ఛార్జీ వసూల్ చేయబోమని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ అప్పుల్లో ఉందని చెబుతుంటారు. లాభాల్లోకి కాకున్నా.. మెయింటనెన్స్ వెళ్లదీయాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ ప్రైవేట్ యాప్స్ ప్రయారిటీ తగ్గించే ప్రయత్నం చేశారు. లేదంటే వారి టర్నోవర్ పెరుగుతుంది.. కానీ ఆర్టీసీకి ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.
ఆర్టీసీకి ఇరు రాష్ట్రాల్లో అప్పులు పెరుగుతున్నాయి. కానీ సంస్థ నిర్వహణ భారం కష్టంగా మారుతుంది. సంస్థలకు మాత్రం ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు, భవనాలు.. వేల కోట్ల రూపాయల విలువ చేస్తాయి. అదొక్కటే సంస్థలకు ఊరట ఇచ్చే విషయం. మిగతా అప్పులు మాత్రం కంటిన్యూ అవుతు వస్తున్నాయి. దీంతో సంస్థల నిర్వహణ వ్యయం భారం అవుతుంది.