అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ విర్ర‌వీగుతున్నారు : బ‌్లాక్ మెయిలింగ్..కుమ్మ‌క్కు రాజ‌కీయాలు: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Serious Reaction On KCR Comments | Oneindia Telugu

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డితో మొద‌లైన కెసిఆర్ కామెంట్ల పై ఏపి సీయం చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. తొలుత కేసిఆర్ ఏపిలో ప్ర‌చారం చేసుకోవ‌చ్చ‌ని చెప్పిన చంద్ర‌బాబు..ఇప్పుడు స్వ‌రం పెంచారు. కెసిఆర్ విర్ర‌వీగుతున్నార‌ని ఫైర్ అయ్యారు. కేసిఆర్ బ్లాక్ మెయిలింగ్‌..తిట్ట‌డ‌మే ధ్యేయంగా రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ వ్యాఖ్య‌ల పై చంద్ర‌బాబు సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యారు.తెలంగాణ ఎన్నికల సంద ర్భం గా కేసీఆర్‌ తనను తిట్టినా, తను మర్యాదగానే ప్రచారం నిర్వహించానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేసీఆర్‌ రాష్ట్రంలో పోటీకి వస్తానంటున్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. అభి వృద్ధికి ప్రాధాన్యమిచ్చే తెదేపాని, ఇతర పార్టీలతో బేరీజు వేసుకుని ప్రజలు గమనిస్తున్నారు.

Chandrababu serious reaction on KCR comments ..

జగన్‌, పవన్‌, ఎంఐఎంలతో కలసి కేసీఆర్‌ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాల్ని ప్రజలు హర్షించరన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ నెలకొల్పి దేశాన్ని మారు స్తానని, తనే మేధావినని కేసీఆర్‌ విర్రవీగుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. బ్లాక్‌మెయిలింగ్‌, తిట్టడమే ధ్యేయంగా కేసీఆర్‌ రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. తెలంగాణలో ఓటమిపై సమీక్షించుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏపిలో కెసిఆర్ జోక్యం చేసుకుంటానంటూ చేస్తున్న కామెంట్ల పై టిడిపి నేత‌లు సీరియ‌స్‌గానే స్పందిస్తున్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ తో పాటుగా కెటిఆర్ సైతం ఇదే అంశం పై ప్ర‌తీ రోజు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా, ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం తాను ఏపికి వెళ్లి..చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా..జ‌గ‌న్ కు అనుకూలంగా ప్ర‌చారం చేస్తాన‌ని చెబుతున్నారు. దీనికి కౌంట‌ర్ గా టిడిపి నేత‌లు సైతం స్పందిస్తున్నారు. చంద్ర‌బాబు ఏపిలో రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తే తిరిగి చంద్ర‌బాబు సీయం అవుతార‌ని కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
AP C.M Chandra Babu Naidu seriously reacted on KCR comments. Chandra Babu alleged that KCR doing block mailing politics. He told party do analysis on Telangana results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X