మున్సిపోల్స్‌లో సత్తా చాటాలి.. శ్రేణులతో చంద్రబాబు

అందరం కలిసి ముందుకెళ్తే టీడీపీని అడ్డుకోవడం ఎవరితరం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం అభినందనీయమన్నారు. సమష్టిగా పోరాడి విజయాన్ని అందుకున్నామని చంద్రబాబు నాయుడు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. విజయదుందుబి మోగించాలని.. అందుకోసం ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకొని ముందడుగు వేయాలని కోరారు.

పంచాయతీ ఎన్నికల మాదిరిగా ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం మున్సిపల్ ఎన్నికల్లో కుదరదని తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ ఉపసంహరణలు ఉండవని చెప్పారు. ప్రలోభాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. కలిసి ముందుకెళ్తే టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదన్నారు. ఈ విషయం శ్రేణులు గుర్తుంచుకోవాలని సజెస్ట్ చేశారు.

chandrababu suggests to leaders on municipality election

వైసీపీ నేతల అక్రమాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్టణంలో విజయసాయి రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖను అరాచకానికి చిరునామాగా మార్చారని విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి అరాచకాలను ఎదుర్కొనేందుకు టీడీపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇదీ వచ్చే ఎన్నికలతో రుజువు అవుతోందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+