ఒక్క కేసునైనా ఎదుర్కో.. నిర్దోషిగా బయటపడు, చంద్రబాబుపై విజయసాయి నిప్పులు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడి అడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం అని సెటైర్ వేశారు. చట్టం ముందు నిలబడే దమ్ముందా అని ప్రశ్నించారు. వందోసారి స్టే కోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. స్టే కోసం చివర వరకు పోరాడటం ఆయనకు అలవాటు అయిపోయిందని వివరించారు.
చంద్రబాబు నాయుడుకు ప్రజాకోర్టులో ఘోరమైన శిక్షలు తప్పవని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. మీకు ఇల్లే జైలు అయిపోతుందని అని చెప్పారు. ఈ మాట రుజువు అవుతోందని వెల్లడించారు. తాను చెప్పిన మాట నిజం అవుతోందని.. అప్పుడు మీరే చెబుతారని విపక్ష నేతలను ఉద్దేశించి కామెంట్ చేశారు.

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. చట్ట విరుద్ధంగా నోటీసులు ఇచ్చారని, ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. రేపు విచారణను చేపడతామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి స్పందించారు. ఒక్క కేసునైనా ఎదుర్కొవాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications