అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరివేపాకులా వాడి..వదిలేసి, సవాంగ్ ఇష్యూపై వర్ల రామయ్య.. జగన్‌పై ఫైర్

|
Google Oneindia TeluguNews

గౌతమ్ సవాంగ్‌ను పదవీ నుంచి తప్పించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. ఉద్యోగుల ర్యాలీ సక్సెస్ కావడంతో ఆయన పోస్టు బూస్టింగ్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి విపక్ష టీడీపీ కూడా స్పందించింది. ఇదివరకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ నేత వర్ల రామయ్య వంతు వచ్చింది.

కరివేపాకులా..

కరివేపాకులా..


గౌతమ్ సవాంగ్‌ను తొలగించడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. అధికారులను సీఎం జగన్ వాడి పారేసే విధానం మరోసారి బయటపడిందని విమర్శించారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ ప్రకాశ్, అజేయ కల్లం, పీవీ రమేశ్ వంటి ఐఏఎస్‌లను కూడా వాడుకుని వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారి సవాంగ్ విషయంలో అదే జరిగిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.

అన్నా అని పిలిచి

అన్నా అని పిలిచి

సవాంగ్ అన్నా అని పిలిచి కరివేపాకులా వాడుకుని వదిలేశారని వర్ల రామయ్య విమర్శించారు. సవాంగ్ ఐపీసీ నిబంధనలు కూడా పక్కనబెట్టి జగన్ కోసం పనిచేశారని పేర్కొన్నారు. గౌతమ్ సవాంగ్ వ్యవహారం అధికారులకు గుణపాఠం కావాలని వర్ల రామయ్య హితవు పలికారు. ఇకనైనా జగన్ చెప్పినట్టు వింటే ఏం జరుగుతుందో గ్రహించాలని కోరారు.

అంతా మీరే చేశారు..

అంతా మీరే చేశారు..

విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తోంది.

అనుమతి లేదు..

అనుమతి లేదు..


వాస్తవానికి ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ వచ్చారు. ఉద్యోగులు భారీగా తరలిరావడంతో ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీనిపై డీజీపీ సవాంగ్.. సీఎం జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి డీజీపీని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం ఏపీ సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు డీజీపీని ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి.

English summary
cm jagan use gautam sawang, after dismiss the post tdp leader varla ramaiah alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X