పోలవరం పర్యటన: 19వ తేదీన సీఎం జగన్ రాక
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19వ తేదీ (సోమవారం) పోలవరం పర్యటనకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో జలజగడం నెలకొన్న క్రమంతో.. సీఎం జగన్ ప్రాజెక్టు పనులు పరిశీలించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరతారు. హెలిప్యాడ్ నుంచి ఉదయం 10.10కి బయలుదేరి పోలవరంలోని హెలిప్యాడ్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి కాపర్ డ్యామ్, తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. తదుపరి అక్కడ నుంచి ఉ.11.50 గంటలకు బయలుదేరి సమావేశ మందిరానికి మ.12.00కి చేరుకుని మ.1.00 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
అనంతరం పోలవరం లోని సమావేశ మందిరం నుంచి మ.1.10 బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకుని మ.1.20 కు అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇంతకుముందు ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని అనుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది.












Click it and Unblock the Notifications