అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ కొరత ఉండొద్దు, అధికారులకు సీఎం జగన్ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పని తీరుపై క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్‌ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలం కొనసాగితే అవి భారంగా తయారవుతాయని తెలిపారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని అధికారులకు సూచించారు.

cm ys jagan review meeting energy department and power distribution

వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్‌ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంతమేర విద్యుత్ అవసరం అవుతుందో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15 యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇంధనశాఖ ఎక్స్ అఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీ జీ సాయిప్రసాద్‌, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan review meeting energy department and power distribution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X