అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి సందర్శన యాత్ర : అన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం..

|
Google Oneindia TeluguNews

ఏపి రాజ‌ధాని సంద‌ర్శ‌న యాత్ర ప్రారంభం అవుతోంది. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న నిర్మాణాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని ప్ర‌జ‌లు సంద‌ర్శించేందుకు వీలుగా సీఆర్డీఏ సంద‌ర్శ‌న యాత్ర ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు రోజుల్లోనే 500 మందికి సంద‌ర్శ‌న ఏర్పాట్లు చేసారు..

ఏపి నూత‌న రాజధాని అమ‌రావ‌తి ని ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర చేసేందుకు సీఆర్డీఏ అధికారులు కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టా రు. అందులో భాగంగా.. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ప్రజలు తిలకించేందుకు వీలుగా అమరా వతి సందర్శన యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలను బస్సుల్లో తీసుకొచ్చి రాజధానిలో అభివృద్ధి పనులు చూపిస్తామని చెప్పారు.

CRDA inviting 13 dists people for Amaravati Visit..

మొదటి మూడు రోజుల్లోనే 13 జిల్లాల్లోని 13 మండలాలకు చెందిన సుమారు 500 మందిని అమరావతికి తీసుకువస్తామని, భోజన ఏర్పాట్లు ఏపీసీఆర్‌డీఏ చేస్తోంది. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో అధికారులు నివాస గృహాలు..హైకోర్టు భ‌వ‌న నిర్మాణాలు దాదాపుగా పూర్త య్యాయి. దీంతో పాటుగా స‌చివాల‌య ట‌వ‌ర్ల నిర్మాణానికి ముఖ్య‌మంత్రి శంక‌స్థాప‌న చేసారు. ఇక‌, అసెంబ్లీ - స‌చివాల‌య తాత్కాలిక భ‌వనాలు ఉన్నాయి.

ఏపిలోని 13 జిల్లాల ప్ర‌జ‌ల్లో అమ‌రావ‌తి నిర్మాణం పై ఆస‌క్తి నెల‌కొంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కేంద్రం స‌హ‌క‌రించుకు న్నా..తాము అమరావ‌తి నిర్మాణంలో ముందుకు వెళ్తున్నామ‌ని చెబుతోంది. అంత‌ర్జాతీయ స్థాయిలో సింగపూర్ ను మించి పోయేలా అమరావ‌తి న‌గ‌రాన్ని నిర్మిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెబుతున్నారు. దీంతో..అమ‌రావ‌తి లో ఒక్క ఇటుక కూడా ప‌డ లేద‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌లకు స‌మాధానంగా..ప్ర‌భుత్వం అమ‌రావ‌తి సంద‌ర్శ‌న యాత్ర‌కు శ్రీకారం చుట్టింది.

English summary
Amaravati Visit start today. CRDA inviting 500 people from 13 districts in coming three days. They allow to visit constructions in Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X