అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదు ఐటి సంస్థ‌లు ప్రారంభం : త‌్వ‌ర‌లో ఏపికి మ‌రిన్ని కంపెనీలు

|
Google Oneindia TeluguNews

ఏపి నూత‌న రాజ‌ధాని లో కొత్త‌గా ఏర్పాటు చేసిన అయిదు ఐటీ సంస్థ‌ల‌ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఏపిఎన్ఆ ర్టీ కార్యాల‌యం ఇన్బోసైట్ భ‌వ‌నంలో ఈ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసారు. ఏపి లో కొత్త‌గా ఐటీ కంపెనీల ఏర్పాటు పై ప్ర‌త్యేక దృష్టి సారించామ‌ని లోకేష్ వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని సంస్థ‌లు ఏపికి రాబోతున్నాయ‌ని లోకేష్ ప్ర‌క‌టించారు..

ఏపి రాజ‌ధాని అమరావ‌తిలో ఒకే రోజు అయిదు ఐటి కంపెనీల‌ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. కంపెనీలు
ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి లోకేష్. ప్రపంచంలో అన్ని చోట్ల భారతీయ ఐటీ నిపుణులున్నార ని, ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది రాష్ట్రానికి చెందిన వారేనని వివ‌రించారు. విభజనకు ముందు ఐటీ అంతా హైదరా బాద్‌కే పరిమితమైందని.ప్ర‌స్తుతం నవ్యాంద్రలో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు.

Five I.T Companies Inagurated : Electronic company for AP

అన్ని స్థాయిల్లోతరహా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్ర‌క‌టించారు. నాలుగేళ్లలో 35 వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించామని, హెచ్‌సీఎల్‌ లాంటి గొప్ప సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని వివ‌రించారు. లోకేష్ ప్రారంభించిన కంపెనీల్లో టీ కనెక్ట్, పారికరం ఐటీ సొల్యూషన్స్‌, టెక్ స్కేప్, ట్రెండ్ సాఫ్ట్, డియాగ్నో స్మార్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి.

గన్నవరం మేథాటవర్స్‌లో రెండో దశ త్వరలో ప్రారంభిస్తామని.. తాత్కాలిక భవనాల్లో 9 ఐటీ కంపెనీలను ఇప్ప‌టి వ‌ర‌కూ త‌ర‌లించామ‌ని లోకేష్ చెప్పారు. ఏపిలో వ‌చ్చే కొత్త కంపెనీలకు ఆకర్షణీయంగా రాయితీలు కల్పిస్తున్నామని, యువనేస్తం కింద భృతితో పాటు శిక్షణ ఇస్తున్నామని వివ‌రించారు. టీసీఎల్‌ కంపెనీ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని, రాష్ట్రానికి మరో ఎలక్ట్రానిక్‌ కంపెనీలు రాబోతుందని లోకేష్ తెలిపారు.

English summary
Minister Lokesh inagurated five I.T companies in Amaravati. He anounced shortly another four companies start work in new capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X