ఏబీ వెంకటేశ్వరరావు ఏసీబీ కేసు పరిస్థితి ఏంటీ.., విచారణ 19కి వాయిదా
ఇటీవల నమోదైన ఏసీబీ కేసు గురించి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇవాళ కోర్టు ఆ కేసును విచారించింది. కేసు కొట్టివేయాలని ఏబీ కోర్టును కోరారు. కేసుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
నిబంధనలకు విరుద్దంగా కేసు నమోదు చేశారని ఏబీవీ ఆ పిటిషన్‌లో కోరారు. కేసు ఫైల్ చేసి 15 నెలలు అవుతున్నా.. చార్జిషీట్ దాఖలు చేయలేదని ఏబీ పేర్కొన్నారు. తాజా పరిస్థితిని తెలియజేయాలని కోర్టు కోరగా.. 4 వారాల గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. 2 వారాల గడువు ఇస్తున్నామని తెలియజేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

గత ప్రభుత్వ హయాంలో ఏరోశాట్, యూఏవీల కొనుగోల కోసం వెచ్చించిన రూ.25.5 కోట్లలో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆధారాలు సేకరించి.. చర్యలు తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పిస్తూ.. నిర్ణయం తీసుకుంది. దీనిపై తాను న్యాయపరంగా పోరాడుతానని ఏబీవీ చెప్పారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు.
ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్‌లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారని విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. దానిపై ఆయన కోర్టులో పోరాడుతున్నారు.












Click it and Unblock the Notifications