అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మోసపు రెడ్డి.. సుమిత్రను తీసుకురాగలవా.. నారా లోకేశ్ ఆగ్రహం (వీడియో)

|
Google Oneindia TeluguNews

విద్యార్థిని మృతి దుమారం రేపింది. అయితే ఆమె ఆశ్రమ పాఠశాలలో చదువుకోవడం.. అనారోగ్యం బారినపడింది. మెరుగైన వైద్య సేవలు అందించకుండానే ఇంటికి పంపించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒక అడుగు ముందుకు వేసిన నారా లోకేశ్.. సీఎం జగన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. నిద్రావ‌స్థలో ఉన్న జ‌గ‌న్ స‌ర్కారు వ‌ల్లే ఓ గిరిజ‌న విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు.

విద్యార్థిని మృతి..

విద్యార్థిని మృతి..


తూర్పుగోదావ‌రి జిల్లా మారేడుమిల్లి ఆశ్రమ‌ పాఠ‌శాలలో విద్యార్థిని సుమిత్ర 10వ త‌ర‌గ‌తి చ‌దువుతుంది. ఆమె అనారోగ్యానికి గురయ్యింది. దీంతో బోద‌లూరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్యం మెరుగుపడలేదు. అక్కడ నుంచి మారేడుమిల్లి, అక్కడి నుంచి రంప‌చోడ‌వ‌రం, రాజ‌మండ్రి తీసుకెళ్లారు. అయినా నో యూజ్.. త‌రువాత కాకినాడ ప్రభుత్వ వైద్యశాల‌ల‌కు త‌ర‌లించారు. కానీ మెరుగైన వైద్యం చేయ‌లేదు. న‌యం కాకుండానే ఇంటికి పంపించి వేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు తీరు ఘోరంగా ఉందని ట్వీట్ చేశారు.

జగన్ మోసపు రెడ్డి..

జగన్ మోసపు రెడ్డి..


జ‌గ‌న్ మోస‌పు రెడ్డి మాట‌లు అందాల సుమిత్రని తిరిగి తీసుకురాగ‌ల‌వా..? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆ బాలిక న‌డిరోడ్డుపై త‌ల్లి ఒడిలోనే క‌న్నుమూసింది. ఇదీ త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని ఆయ‌న భావోద్వేగపూరితంగా స్పందించారు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరితే రోగం న‌యం కాకుండానే ఇంటికి పంపేసిన వైద్యుల తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ల్లి వెంట ఇంటికి బ‌య‌లుదేరిన సుమిత్ర న‌డిరోడ్డుపై త‌ల్లి ఒడిలోనే కుప్పకూలింది. అలా తల్లి ఒడిలోనే క‌న్నుమూసింది. విషయం తెలిసిన వెంట‌నే లోకేశ్ స్పందించారు.

స్పందించండి.. జగన్


పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై ఆయన స్పందించారు. జంగారెడ్డిగూడెం ఘటనను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవట్లేదని మండిపడ్డారు. కల్తీ సారా మరణాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశామని వివరించారు. అసెంబ్లీ సాక్షిగా కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించి సీఎం సభని, ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జంగారెడ్డిగూడెం ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.50 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో నాటుసారా కాస్తారా..? అని ప్రశ్నిస్తున్న జగన్.. కేవలం వారం రోజుల పరిధిలోనే సారా కాస్తున్న వారిపై పోలీసులు అన్ని కేసులు ఎందుకు నమోదు చేశారో సమాధానం చెప్పే దమ్ముందా..? అని నారా లోకేశ్ సవాల్ విసిరారు.

English summary
if ys jagan government take sumitra alive tdp leader nara lokesh asked. 10th student sumithra died due to illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X