ఇదేంటి జగన్.. హామీలు తీర్చాలని అడిగితే అరెస్టులా..? నారా లోకేశ్ ఫైర్
జగన్ సర్కార్‌పై టీడీపీ నేత లోకేశ్ ఫైరయ్యారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యమం అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్ వాడీలకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవు మంజూరు చేయాలని కోరారు. ఇదీ వారి న్యాయమైన హక్కు అని స్పష్టంచేశారు. వారి డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
సర్వీసులో ఉండి చనిపోయిన వారికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నారా లోకేశ్ అన్నారు. రేషన్ కార్డులు తొలగించి సంక్షేమ పథకాలు అందకుండా చేయొద్దని స్పష్టంచేశారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. అడగడం పాపామా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. వారి డిమాండ్లను నెరవేర్చకపోవడం మంచిది కాదన్నారు.

కరోనా సమయంలో ఆశా వర్కర్లు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించారని లోకేశ్ గుర్తుచేశారు. అలా చేసిన వారికి తగిన ప్రతిఫలం దక్కలేదని వివరించారు. వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిందని తెలిపారు. కానీ వారికి కనీసం మాస్కులు, చేతి గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వివక్షేనని తెలిపారు. కరోనా వైద్య బృందాలతోపాటు వెళ్లి విధి నిర్వహణలో కరోనా సోకి మరణించిన ఆశా కార్యకర్తలకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం దారుణం అని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. నిర్బంధాల ద్వారా జగన్ సర్కార్ హరించడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి తీరు ఏపీ సర్కార్ మార్చుకోవాలని పేర్కొన్నారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని నారా లోకేశ్ స్పష్టం చేశారు. వారి సమస్యలను పరిష్కరించకుండా.. వేధించడం ఏంటీ అని అడిగారు. ప్రజల సేవలో ఆశా వర్కర్లు నిమగ్నం అవుతున్నారని.. నిత్యం పనిచేస్తూనే ఉన్నారని వివరించారు. కరోనా సమయంలో అసలు తీరికే ఉండటం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications