సీయం అంటే క్రిమినల్ మినిష్టర్..బాబు ఓ మాయావి: జగన్ తీవ్ర ఆరోపణలు..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపి అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు హాయంలో సీయం అంటే క్రిమినల్ మినిస్టర్ గా మార్చేసారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆంటి మాయావి ఎవరూ ఉండరని ఆరోపించారు. వివేకా ను చంపించింది చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
స్టేలు ఎందుకు బాబు..
ముఖ్యమంత్రి చంద్రబాబు కు సిబిఐ ..ఇడి..ఐటి..చివరకు తెలంగాన కానిస్టేబుల్ అన్నా భయపడిపోతున్నారని వైసి పి అధినేత జగన్ ఆరోపించారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయకపోతే సాంకేతిక కారణాలను చూపిస్తూ..స్టే లు ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నాడు చంద్రబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల ను జగన్ ప్రస్తావించారు. విజయవాడ లో కాల్ మనీ నిర్వహకులకు సీయం అండగా నిలిచారని ఆరోపించారు. ఇదే అంశం పై నిలదీసినందుకు వైసిపి ఎమ్మెల్యే రోజా పై సస్పెన్షన్ వేటు వేసారని గుర్తు చేసారు. తన చిన్నాన్న వివేకా ను తాము పోగొట్టుకుంటే తమ పైనే విమర్శలు చేస్తున్నారని..వివేకాను చంపించింది చంద్రబాబు అని మరోసారి విమర్శ లు గుప్పించారు. వనజాక్షి..రుషితేశ్వరి వ్యవహారాలను జగన్ మరోసారి ప్రస్తావించారు. తన అధికారం కోసం ఎవరినైనా చంపిస్తారంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు.

డ్వాక్రా రుణాల రద్దు..
తాను అధికారంలోకి వస్తే ఎన్నికల నాటికి ఉన్న మొత్తం డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని జగన్ మరోసారి హామీ ఇ చ్చారు. అదే విధంగా నవరత్నాల గురించి జగన్ వివరించారు. చంద్రబాబు తాను అయిదేళ్ల కాలంలో ఏం చేసాడో చెప్పుకోలేక...తన మీద పడి ఏడుస్తున్నారని ఎద్దేవా చేసారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన ఏ హామీ నెరవేర్చ లేదని..ఇప్పుడు మేనిఫెస్టోనే పూర్తిగా మాయం చేసారని జగన్ పేర్కొన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. ఇస్తే తాను వైయస్సార్ ను మరిపించేలా పాలన చేస్తానని హామీ ఇచ్చారు. నవరత్నాల ద్వారా ప్రతీ కుటుంబంలో ప్రతీ ఒక్కరి జీవితాలు బాగు పడతాయని జగన్ వివరించారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చంద్రబాబు డబ్బు మూటలను గ్రామాల్లోకి దించుతారని..వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగు తున్న యుద్దంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications