అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు అందుకే రాహుల్ ని క‌లిసారు : ఏపిలో ఒంటిరిగా వెళ్తే 50 సీట్లు కూడా రావు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపిలో ఒంటిరిగా వెళ్తే 50 సీట్లు కూడా రావు..! | Oneindia Telugu

టిడిపి అధినేత చంద్ర‌బాబు..కాంగ్రెస్ అధినేత రాహుల్ తో క‌ల‌వ‌టం తో స్వ‌యంగా పిసిసి అధ్య‌క్షుడే షాక్ కు గుర‌య్యాన ని చెబుతున్నారు. ఎక్క‌డా స‌మాచారం లీక్ కాకుండా..కేవ‌లం ముందు రోజు అందుబాటులో ఉన్న మంత్రుల‌తో మాత్ర‌మే షేర్ చేసుకున్నారు. ఇక‌..ఏ పార్టీ ఏపిలో పోటీ చేసినా 50 సీట్లు రావ‌ని టిడిపి - కాంగ్రెస్ నేత‌లు అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా పిసిపి చీఫ్ ర‌ఘువీరా చేసిన కామెంట్లు సైతం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. దీని కార‌ణంగా నే టిడిపి - కాంగ్రెస్ పార్టీలు పొత్తు దిశ‌గా న‌డుస్తున్నాయా అనే చ‌ర్చ మొద‌లైంది...

ఏపి సీయం చంద్ర‌బాబు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిసిన‌ప్పుడు తాను షాక్ కు గుర‌య్యాన‌ని పిసీసీ చీఫ్ ర‌ఘువీరా రెడ్డి చెబుతున్నారు. ఆ షాక్ నుండి తేరుకోవ‌టానికే 24 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. రాహుల్‌ వద్దకు చంద్రబాబు ఎందుకు వెళ్లారంటే..

Main reason for Chandrababu meet Rahul : Raghuveera key Comments

రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ పార్టీ అయినా పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే 40 లేదా 50 సీట్లు కూడా రావు. అలాంటప్పుడు ఏ పార్టీకి అధికారం రాదు' అంటూ ర‌ఘువీరా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఏపిలో సొంతంగా 50 సీట్లు సాధించ‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుతం పార్టీలు ఉన్నాయా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. టిడిపి -వైసిపి లు పోటీ పోటీగా త‌మ‌దే అధికారం అని చెబుతున్న స‌మ‌యంలో తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం తాను సీయం అవుతానంటూ చెబుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ర‌ఘువీరా చేసిన కామెంట్ల పై అటు టిడిపి లో..ఇటు కాంగ్రెస్ లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ర‌ఘువీరా వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే...వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి కి 50 సీట్లు మించి రావ‌నే అంచ‌నాతోనే టిడిపి అధినేత ఏపిలో కాంగ్రెస్ తో పొత్తుకు ముందుకు వ‌చ్చారనే అభిప్రాయం క‌లుగుతోంది. అయితే, కేవ‌లం టిడిపికే కాద‌ని..ఏపిలో ఏ జాతీయ పార్టీ అయినా..ప్రాంతీయ పార్టీ అయినా ఇదే పరిస్థితి ఉంద‌ని ఆయ‌న గ‌ట్టిగా చెబుతున్నారు. అయితే, ఏపిలో టిడిపి తో పొత్తు విష‌యంలో పార్టీ హైక‌మాండ్ నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకుంటామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఏపి రాజ‌కీయాల పైనా ఓ స్ప‌స్ట‌త వ‌చ్చే ఆవ‌కాశం ఉంది.

English summary
Pcc chief Raghuveera key commetns on Tdp chief Chandra babu and Rahul suddden meeting. Rahuveera observe that no party gain more than 50 seats in AP with out alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X