అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులు టీడీపీలో లేవు..? మంత్రి కన్నబాబు హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

​రాష్ట్రంలో మహిళలపై జరిగిన పలు ఘటనల పట్ల టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ ప్రభుత్వాన్ని తప్పుబడుతుండడంపై మంత్రి కన్నబాబు స్పందించారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు ప్రజలపై నిజంగా ప్రేమ లేదని ఆరోపించారు. మహిళల భద్రత గురించి ఎవరో చెబితే నేర్చుకోవాల్సిన స్థితిలో తమ ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు తాము ఎలా స్పందిస్తున్నామనే విషయం అందరికీ తెలుసని అన్నారు. లోకేశ్ చేస్తున్న అల్లరి అంతా తండ్రి చంద్రబాబు ఇచ్చిన శిక్షణ ఫలితమేనని కన్నబాబు కామెంట్ చేశారు.

బాబు స్క్రీన్ ప్లే..

బాబు స్క్రీన్ ప్లే..

చంద్రబాబు స్క్రీన్ ప్లేలో లోకేశ్ నటిస్తున్నాడని వ్యాఖ్యానించారు. గతంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగితే జగన్ వెళితే కేసులు పెట్టింది ఎవరి ప్రభుత్వం? అని ప్రశ్నించారు. రన్ వేపై ఆపేసి దారుణంగా వ్యవహరించింది ఎవరు? నాడు కాపులు కంచాలు మోగిస్తే వేలమంది కేసులు పెట్టింది ఎవరు?" అంటూ కన్నబాబు టీడీపీ అధినాయకత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ ప్రజస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తోందని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులు లేకపోవడంతో ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని కన్నబాబు విమర్శించారు.

Anasuya Bharadwaj :చీరలో కూడా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అనసూయ.. బ్యూటీఫుల్ ఫొటోస్

అధినేత ఆయనే

అధినేత ఆయనే

వాస్తవానికి ఇప్పటికీ కూడా చంద్రబాబు అధినాయకత్వంలో పార్టీ పనిచేస్తోంది. లోకేశ్‌ను ప్రమోట్ చేయాలని బాబు అనుకుంటున్నారు. అందుకే చినబాబును రంగంలోకి దించారు. కానీ లోకేశ్‌ను టీడీపీ నేతలు అంగీకరించే పరిస్థితిలో లేరని కన్నబాబు కామెంట్ చేయడం చర్చానీయాంశం అయ్యింది. అంటే టీడీపీలో గ్రూపులు ఉన్నాయా..? ఎవరు అంగీకరించడం లేదు అనే ప్రశ్న వస్తోంది. లోకేశ్ లేదంటే బ్రహ్మణికి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి త్రెట్ ఉందని ఇంటా, బయట చర్చ జరుగుతుంది. తారక్ పార్టీని తన గుప్పిట్లోకి తీసుకుంటారని.. కొందరు అతనికి సపోర్టుగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఈ రూమర్లకు తెరపడాలంటే కాలమే సమాధానం చెప్పాలి మరీ.

అడ్డుకోవడంతో..

అడ్డుకోవడంతో..

లోకేశ్ ను ఇవాళ గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. దీనిపై లోకేశ్‌తో పాటు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి కన్నబాబు స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లే ముందు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనూష ఫ్యామిలీకి అండగా

అనూష ఫ్యామిలీకి అండగా

గుంటూరు జిల్లా గొల్లపాలెం లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకోవడానికి వేలాదిగా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ పరిస్థితులపై ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఇతర నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దానికి అధికార వైసీపీ నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి. అలా మంత్రి కన్నబాబు హాట్ కామెంట్స్ చేశారు.

English summary
andhra pradesh minister kanna babu hot comments on nara lokesh. lokesh leadership not agree to tdp kanna babu alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X