• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమ‌రావ‌తికి కొత్త శోభ‌ : సచివాలయ టవర్ల నిర్మాణానికి శ్రీకారం : ప‌్రారంభించిన సీయం..

|

ఏపి రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క నిర్మాణానికి పునాది ప‌డింది. ర్యాప్ట్ పౌండేష‌న్ మాస్ కాంక్రీట్ విధానంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 4 మీట‌ర్ల లోతు..52 మీట‌ర్ల పొడ‌వు,,అంతే వెడ‌ల్పు కాంక్రీట్ తో 40 అంత‌స్తుల ఎత్తులో నిర్మిస్తు న్న అధునాత‌న సచివాల‌య ట‌వ‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి పునాది వేసారు.

అమ‌రావ‌తిలో మ‌రో అద్బుత నిర్మాణానికి పునాది వేసారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అమ‌రావ‌తి లోని రాయ‌పూడి లో ఈ స‌చివాల‌య ట‌వ‌ర్ల నిర్మాణానానికి పూజ‌లు చేసి..పునాది వేసారు. దేశంలో ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో అమరావతిలోని సెక్రటేరియట్‌- హెచ్‌వోడీల కోసం 5 ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. వీటిలో నాలుగు టవర్లను 40 అంతస్తులు... సీఎం కొలువుతీరే జీఏడీ టవర్‌ను 50 అంతస్థులతో ఐకానిక్‌గా నిర్మిస్తున్నారు.

తొలిసారిగా ఒకే చోట స‌చివాల‌యం తో పాటుగా 145 హెచ్ఓడి కార్యాల‌యాలు ఏర్పాటు జ‌రుగుతోంది. 225 మీట‌ర్ల ఎత్తుతో ప్ర‌పం చంలోనే అతి ఎత్త‌యిన స‌చివాల‌యంగా ఖ్యాతి ద‌క్కించుకోనుంది. 40 అడుగుల ఎత్తు..6.9 మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగు ల విస్తీర్ణం..రెండు ద‌శ‌ల లిఫ్ఠ్ విధానం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. ఇక‌, 16 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వ‌హించేందుకు వీలుగా ఈ నిర్మాణాలు చేప‌డుతున్నారు. రూఫ్ టాప్ హెలిపాడ్ ఇక్క‌డి మ‌రో ఆక‌ర్ష‌ణ‌.

New Secretariat towers works Start : C.M Inaugurates Raft Foundation works..

అన్నీ ప్ర‌త్యేక‌త‌లే.. ఆక‌ర్ష‌ణీయం..

స‌చివాల‌య ట‌వ‌ర్స్ పునాది కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి తో పాటుగా ప‌లువురు మంత్రులు..అధికారులు..సీఆర్డిఏ సిబ్బంది హాజ‌ర‌య్యారు. ఈ స‌చివాల‌య ట‌వ‌ర్ల‌లో పార్కింగ్ కోసం 13 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు కేటాయిస్తున్నారు. ఇందులో క‌నీసం నాలుగు వేలకు పైగా కార్ల‌ను పార్క్ చేసుకొనే వీలు ఉంది. అయిదు ట‌వ‌ర్ల కాంట్రాక్టును ఎస్‌సిసి, షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పనులను ఈజిస్‌ అనే ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పర్యవేక్షిస్తోంది. ఐదు టవర్లను కలుపుతూ 'ఎలివేటెడ్‌' కాలిబాట వంతెన ఏర్పాటు చేస్తారు.

మోడీ! ఏ మొహం పెట్టుకొని వస్తున్నావ్: చంద్రబాబు నిప్పులు

అవసరాన్ని బట్టి అధికా రులు, ఉద్యోగులు, సందర్శకులు ఒక టవర్‌ నుంచి మరో టవర్‌కు సులువుగా వెళ్లే వెసులుబాటును క‌ల్పిస్తున్నారు. స‌చివాల‌యంలో ప‌రిపాన‌ల‌కు సంబంధించిన కీల‌క భ‌వ‌నాల కు పునాది ప‌డ‌టంతో ఇక‌..ఇత‌ర నిర్మాణాలు వేగంగా పూర్త‌వుతాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఇప్ప‌టికే హైకోర్టు..అధికారుల నివాస స‌ముదాయాలు దాదాపు పూర్త‌య్యే ద‌శ‌కు వ‌చ్చాయి. వీటితో అమ‌రావ‌తి నూత‌న రూపు సంత‌రించుకోనుంది.

English summary
New Secretariat Towers works started in Amaravati. C.M Chandra Babu started works. With all specialities Towers Plan desgined. In Raft foundation mas concrete mode construction taking place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X