అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిన్నిస్ బుక్‌లోకి పోల‌వ‌రం : 29 వేల క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Polavaram Project Sets Guinness Book of World Record | Oneindia Telugu

ఏపి ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు పోల‌వ‌రం గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రికార్డు స్థాయిలో గంట కు 1300 క్యూబిక్ మీట‌ర్ల స‌గ‌టున‌.. మొత్తంగా 29,664 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీటు ప‌నులు పూర్తి చేసి రికార్డు సొంతం చేసు కుంది. 22 గంట‌ల ప‌నుల్లో గ‌తం లో ఉన్న రికార్డుల‌ను తిరగ రాసి న‌వ‌యుగ సంస్థ ఈ రికార్డు ద‌క్కించుకుంది.

పోల‌వ‌రం

పోల‌వ‌రం

ఏపి బహుళార్ద సార్ద‌క ప్రాజెక్టు పోల‌వ‌రం మ‌రో ఘ‌న‌త సాధించింది. ఇప్ప‌టికే వేగంగా సాగుతున్న కాంక్రీట్ ప‌నుల్లో మ‌రో కొత్త రికార్డు నెల‌కొల్పింది. గిన్నిస్ రికార్డుల్లో ఎలాగైనా స్థానం ద‌క్కాల‌నే ల‌క్ష్యంతో ఆదివారం ఉద‌యం 8 గంటల నుండి కాంక్రీట్ ప‌నులు ప్రారంభించారు.

గిన్నిస్ బుక్‌లోకి పోల‌వ‌రం

గిన్నిస్ బుక్‌లోకి పోల‌వ‌రం

సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల స‌మయానికి 29,664 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు పూర్తి చేసి రికార్డు నెల‌కొల్పారు. ప్ర‌తీ గంట‌కు స‌గ‌టున 1300 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్ చేసారు. రాత్రి నుండి తెల్ల‌వారే వ‌ర‌కూ..ఫ్ల‌డ్ లైట్ల వెలుగులో ప‌నులు కొన‌సాగించారు. దాదాపు నాలుగు వేల సిబ్బంది పాల్గొన్న ఈ ప‌నుల‌కు గిన్నిస్ రికార్డు ద‌క్కింది.

పోల‌వ‌రం లో కీల‌కం : తొలి రేడియల్ గేటు ఏర్పాటు : 61 శాతం ప‌నులు పూర్తిపోల‌వ‌రం లో కీల‌కం : తొలి రేడియల్ గేటు ఏర్పాటు : 61 శాతం ప‌నులు పూర్తి

గ‌త రికార్డులు బ‌ద్ద‌లు..

గ‌త రికార్డులు బ‌ద్ద‌లు..


పోల‌వ‌రం లో తాజాగా న‌మోదైన రికార్డుల‌తో గ‌తంలో ఉన్న రికార్డులు చెరిగిపోయాయి. 2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా పోల‌వ‌రం కాంట్రాక్టు సంస్థ న‌వ‌యుగ దీనిని అధిగమిచింది. కృష్ణా జిల్లా జ‌న్మ‌భూమి లో ఉన్న ముఖ్య‌మంత్రి పోల‌ర‌వం లో గిన్నిస్ బుక్ ల‌క్ష్యంగా సాగుతున్న ప‌నుల పై ఆరా తీసారు. లక్ష్యం నెర‌వేర‌టం తో భాగ‌స్వాములంద‌రికీ అభినంద‌న లు తెలిపారు. మంత్రి దేవినేని ఉమా సైతం రాత్రి స‌మ‌యానికి ప్రాజెక్టు ప్రాంగ‌ణానికి చేరుకున్నారు.

English summary
Polavaram Project got place in Guinness book of world records. Concrete works completed in record time and got achieve ment. In 22 hours of time contractors completed 29,664 cubic meters fo concrete works completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X