తుఫానుగా మారిన వాయుగుండం: ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు.. ఈదురుగాలులు
అసలే వేసవి ప్రారంభం.. ఉక్కపోత మాములుగా ఉండటం లేదు. దీనికితోడు తుఫాన్‌తో ఇక్కట్లు తప్పడం లేదు. రోజు సాయంత్రం 4 గంటలు అయితే చాలు.. ఈదురుగాలులు.. స్వల్పంగా గాలి వీస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.
తుఫానుతో ఆంధ్రప్రదేశ్‌లో గల కొద్ది ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా కనిపిస్తున్నాయి. తర్వాత 12 గంటల్లో తుపాను అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. బుధవారం తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లిలో 65.5 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 38.75, ప్రకాశం జిల్లా కనిగిరిలో 37, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. విజయనగరం, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
విశాఖ మన్యంలో అకస్మాత్తుగా కురిసిన వర్షంలో వడగళ్లు పడ్డాయి. నర్సీపట్నం, పాడేరు, కొయ్యూర్, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం గుమ్మిలేరు, విజయనగరం జిల్లాలో మెంటాడలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
వేడికితోడు.. తుఫాన్ కలిసింది. ఉక్కపోత మాములుగా ఉండటం లేదు. అవును దాంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని చెట్లమాటున ఉంటున్నారు.












Click it and Unblock the Notifications