ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఛేంజేస్.. ఆ మార్పు చేర్పులు ఇవే..
పంచాయితీ ఎన్నికల్లో స్వల్ప మార్పులు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీల్లో మార్పులు చేశామని స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో గల ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
పంగులూరు, కోరిశపాడు, ఎస్ మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాల్లో గల పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహిస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి మూడో విడతకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాలుగో దఫాకు బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు.

చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి నర్సాపురం మండలాల్లో గల పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులు ఫిబ్రవరి 17న మూడవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరిలో మిగిలిన మండలాలకు మాత్రం తొలుత నిర్ణయించిన ప్రకారం నాలుగో దఫాలో ఎన్నికలు జరపనున్నామని ఎస్‌ఈసీ పేర్కొంది.
Recommended Video
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. అప్పటినుంచి వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమయ్యారు. కానీ నేతల మధ్య మాటలయుద్ధం మాత్రం జరుగుతోంది.












Click it and Unblock the Notifications