అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ‌రావ‌తిలో అఖిలాండ‌నాయ‌కుడు : 25 ఎక‌రాలు..రూ.150 కోట్ల‌తో : శ‌్రీవారి ఆల‌యానికి తొలి అడుగు..!

|
Google Oneindia TeluguNews

ఏపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ్రీవారి ఆల‌య నిర్మ‌ణానికి తొలి అడుగు ప‌డింది. తుళ్లూరు మండ‌లం వెంక‌పా లెం లో ఆల‌య నిర్మాణంలో భాగంగా ముఖ్య‌మంత్రి చేతుల మీదుడా ఆగ‌మోక్తంగా వైదిక క్ర‌తువుల‌ను నిర్వ‌హించారు . ఆల‌య నిర్మాణానికి సంబంధించి భూక‌ర్ష‌ణం..బీజావాప‌నం కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేసారు.

అమ‌రావ‌తిలో శ్రీ వారి ఆల‌యం..

అమ‌రావ‌తిలో శ్రీ వారి ఆల‌యం..

రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గురువారం తొలి అడుగు పడింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనం లోకి తీసుకుంది.

కృష్ణానది తీరంలో

గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 10న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించ నున్నారు. కృష్ణానది తీరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయం... చోళులు, చాళుక్యుల కాలం నాటి వాస్తు, నిర్మాణ శైలికి అద్దం పడుతుంది.

తొలి అడుగు..క్ర‌తువులు నిర్వ‌హించిన సీయం..

తొలి అడుగు..క్ర‌తువులు నిర్వ‌హించిన సీయం..

తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈరోజు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి ప్రాంతంలో సీఎం నాగలితో భూమి దున్ని నవధన్యాలు చల్లారు. తితిదే వేదపండితులు శాస్త్రోక్తంగా గోపూజ, కలశ పూజ నిర్వహించారు. తిరుమల పెద్దజీయంగార్‌ స్వామి ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిగాయి. భూకర్షణ ప్రాంతంలో గోవు, కలశంతో ప్రదక్షిణ చేశారు. భూకర్షణ, బీజావాపనాన్ని నిర్వహించి ఫిబ్రవరి 10న భూమిపూజ చేయనుంది. వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయడం లక్ష్యంగా టిటిడి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది.

English summary
Sri Venkateswara Swamy new temple construction works start in AP capital Amaravati. CM Chandra babu done starting Pooja as per TTD proceedure. Govt alloted 25 acres land and estimated cost of 125 cr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X