ఆర్జీవీ బోల్డ్ ..టిడిపి బౌల్డ్ : వర్మ ను కంట్రోల్ చేయాల్సిందే : పసుపు దళం ఎదురు దాడి..!
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇప్పుడు టిడిపి కి టార్గెట్ అయ్యారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ సమయంలోనే ఆర్జీవి వెన్నుపోటు పాటను విడుదల చేయటం..అందులో చంద్రబాబు వీడియోలను విచ్చిల విడిగా వినియోగించటం పై టిడిపి మద్దతు దారులు మండి పడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆర్జీవి ని ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో న్యాయ పరంగా పోరాటానికి టిడిపి సిద్దమవుతోంది..

చంద్రబాబు ఫొటోలు విచ్చల విడిగా..
బాలకృష్ణ వర్సెస్ రాం గోపాల్ వర్మ గా టర్న్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా లు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనా లను సృష్టిస్తోంది. ఇంకా సినిమాలు విడుదల కాకుముందే ఈ రగడ మొదలైంది. నందమూరి- టిడిపి అభిమానులు బాలకృష్ణ ఆధ్వర్యంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదే సమయంలో పోటీగా ఆర్జీవీ తీస్తు న్న సినిమా పై టిడిపి వ్యతిరేకుల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు సరిగ్గా..బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించి ఆడియో లాంచ్ చేసిన సమయంలో..వివాదాలకు మారు పేరైన ఆర్జీవి వెన్నుపోటు పేరుతో ఒక పాటను విడుదల చేసా రు.
దీనికి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే, అందులో వెన్నుపోట పాటలో ఎన్టీఆర తో పాటుగా చంద్రబాబు ఫొటోలను..వీడియోలను వినియోంచారు. ఇప్పుడు ఇదే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర లో 1995 వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ పై చాలా అసక్తి కనిపిస్తోంది. దీనిని బాలకృష్ణ ఎంత వరకు కవర్ చేస్తారో అనేది సందేహమే. ఇదే సమయంలో..అదే ఎపిసోడ్ కు ఆర్జీవి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

ఆ సందర్భంలో బాబు ఫోటోలు పదేపదే..
ఆర్జీవి విడుదల చేసిన వెన్నుపోటు పాట లో కుట్ర..దగా..వెన్నుపోటు అనే పదాలు వచ్చే సందర్భంలో చంద్రబాబు ఫొటోలను చూపించారు. నేరుగా చంద్రబాబు పేరు పై ఎటువంటి కామెంట్లు చేయపోయినా..వెన్నుపోటు పాటలో ఎన్టీఆర్ తో పాటుగా ప్రధానంగా చంద్రబాబు ను ఫోకస్ చేయటం నందమూరి- టిడిపి అభిమానులకు రుచించటం లేదు. వెన్నుపోటు పాట రిలీజ్ కాగానే ఒక్క సారిగా టిడిపి నేతలు ఫైర్ అయ్యారు. రాం గోపాల్ వర్మ ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవి సినిమా కు పెట్టుబడి దారుడిగా వైసిపి నేత ఉన్నారని..లక్ష్మీ పార్వతి రచించిన గ్రంధం ఆధారంగా సినిమా తీస్తుండటంతో..ఇది రాజకీయంగా ఎటువంటి నష్టం చేస్తుందో అనే ఆందోళన టిడిపి నేతల్లో కనిపిస్తోంది. సహజంగా వివాదాలు..నెగటివ్ అంశాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీంతో..ఆర్జీవి ఇప్పుడు వైస్రాయ్ ను ప్రధాన కధనంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు టిడిపి నేతల్లో ఇదే అలజడికి కారణమవుతోంది..

ఆర్జీవి పై పోరాటం : న‌్యాయ పరంగానూ..
రాం గోపాల్ వర్మ వెన్నుపోటు పాటను విడుదల చేయగానే...అందులో చంద్రబాబు ఫొటోలు చూసి ఒక్క సారిగా టిడిపి నేతలు..అభిమానులు షాక్ అయ్యారు. వెంటనే కౌంటర్ చర్యలు ప్రారంభించారు. ఒక వైపు టిడిపి నేతలు ఆర్జీవి ని లక్ష్యంగా చేసుకొని దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు టిడిపి సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. ఇదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులు మాత్రం..
ఆర్జీవి చాలా బోల్డ్ గా పాటను చిత్రీకరించారని..దీనికి టిడిపి బౌల్డ్ అవ్వాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో..చంద్రబాబు ఫొటోలు అనుమతి లేకుండా వినియోగిస్తూ దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేసారంటూ ఆర్జీవి పై న్యాయ పోరాటానికి సిద్దం కావాలని టిడిపి నేతలు ఆలోచ న చేస్తున్నారు. ఎన్నికల సమయం కావటంతో..ఇప్పుడు రాజకీయంగానూ ఇది హాట్ టాపిక్‌గా మారుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications