3 రాజధానులు తమ విధానం.. మంత్రి బొత్స నోట మరోసారి అదే మాట

జగన్ సర్కార్ మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. అమరావతి కోసం రైతులు ఉద్యమిస్తోన్న.. సర్కార్ మాత్రం తగ్గేది లేదని అంటోంది. ఇదే విషయాన్ని ఏపీ మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టంచేశారు. ఏపీకి మూడు రాజ‌ధానులు అన్న విధానానికే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. మంగ‌ళ‌వారం అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు తమ పార్టీ, ప్రభుత్వ విధానమ‌ని బొత్స సత్యనారాయణ చెప్పారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామ‌ని పేర్కొన్నారు. సమయాన్ని బట్టి సభలో బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. మొదటి నుండి మూడు రాజ‌ధానుల మాటే చెబుతున్నామ‌ని నొక్కి వక్కానించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే త‌మ‌ లక్ష్యమ‌ని పేర్కొన్నారు.

three capitals is our government policy:minister botsa

ఇత‌ర‌ అంశాల‌పై కూడా స్పందించారు. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? అని కామెంట్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామ‌నీ, అన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ స్కూళ్ల‌లో టీచర్ల సంఖ్య పెంచమని కొన్ని సంఘాలు అడిగాయ‌ని.. ఆ దిశ‌గానూ చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న మూడు రాజధానులపై జగన్ సర్కార్ తగ్గడం లేదు. తథ్యం అని అంటోంది. విపక్ష టీడీపీ మాత్రం సమయం దొరికనప్పుడల్లా ఖండిస్తూ వస్తోంది. రాజధాని కోసం రైతులు చేస్తోన్న దీక్షకు మద్దతు ఇస్తున్నారు. అమరావతి రాజధానే ముద్దు అని ప్రతీసారి చెబుతోంది. ఇప్పుడు బొత్స దానిని మరోసారి రీపిట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+