అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రేపటినుంచి పది పరీక్షలు.. విద్యార్థులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రేపటి నుంచి (23వ తేదీ) నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనున్నాయి. 5 లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరవనున్నారు. సిలబస్‌ను 70 శాతానికి కుదించి కొశ్చన్ పేపర్స్ రెడీ చేశారు. పరీక్ష పేపర్లను కూడా 6 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే.

దగ్గరలోనే సెంటర్

దగ్గరలోనే సెంటర్


జనరల్ సైన్స్ క్యాటగిరీలో ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ప్రశ్నా పత్రాలను వేరుగా ఇస్తారు. ప్రశ్నపత్రంలో ఛాయిస్ ఎక్కువగా ఇచ్చామని వివరించింది. విద్యార్థులు చదువుతున్న స్కూల్ దగ్గరలో పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ కేటాయించింది. పరీక్షల నిర్వహణ కోసం 2 వేల 861 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2861 డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల్లోకి తీసుకున్నారు.

4 ప్లైయింగ్ స్క్వాడ్

4 ప్లైయింగ్ స్క్వాడ్

రాష్ట్రంలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆకస్మిక తనికీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. ఎగ్జామ్ సెంటర్ ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను విద్యాశాఖ కోరింది. పరీక్ష కేంద్రంలో సీసీటీవీ ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎగ్జామ్ సెంటర్‌లో జిల్లా, మండల విద్యాధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. పరీక్ష ప్రారంభం అయిన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 9.35 నిమిషాలకు మాత్రం ఆలో చేయరు.

నో టీవీ, మొబైల్, కంప్యూటర్

నో టీవీ, మొబైల్, కంప్యూటర్

పరీక్ష సమయంలో విద్యార్థి టీవీ, మొబైల్, కంప్యూటర్ వాడొద్దు.. టైమ్ టేబుల్ ప్రకారం చదవాల్సి ఉంటుంది. టీచర్స్, ఫ్రెండ్స్, సీనియర్ల ద్వారా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. విద్యార్థి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలి.. అందుకు పేరంట్స్ ధైర్యం అందజేయాలి. ఒత్తిడి తగ్గించేందుకు వారికి సహాకారం అందిస్తే.. ఎక్కువ సమయం చదవడానికే కేటాయిస్తారు. టైం టేబుల్ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందజేయాలి. అలాగే సమయానికి అనుగుణంగా నిద్రపోయేటట్టు ఫ్యామిలీ మెంబర్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

English summary
tomorrow tenth exams starts in andhra pradesh. students are take this precaustions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X