ఆర్టీజీఎస్ అమేజింగ్ : ఏపికి బ్లెయిర్ ప్రశంసలు ..
ఏపిలో ప్రభుత్వం వినూత్నంగా .. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్జీజీఎయస్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకంగా ఆర్టీజీఎస్ సందర్శన కోసం వచ్చిన బ్లెయిర్ అక్కడ ప్రభుత్వం సంస్థను నిర్వహిస్తు న్న తీరు..సమాచార సేకరణ..దీంతో జరుగుతున్న ప్రయోజనాలు తెలుసుకొని అమేజింగ్ అంటూ ప్రశంసలతో ముం చెత్తారు. ముఖ్యమంత్రిని..అధికారులను అభినందించారు.
అందరికీ ఆదర్శం..
ఏపి ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ పై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అనూహ్యంగా స్పం దించారు. రియల్ టైం గవర్నెన్స్ పనితీరు అద్భుతం అంటూ ప్రశంసించారు. సచివాలయంలోని రియల్ టైం గవ ర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలిసి టోని బ్లెయిర్ సందర్శించారు. ఈ సంస్థ ద్వారా రియల్ టైం లో ఎలా సమాచారం సేకరిస్తుందీ..ఏ రకంగా స్పందిస్తుందీ వివరిస్తూనే..ఇప్పటి వరకు అందిన ఫలితాలను అందు లోని అధికారులు వివరించారు. వారి నుండి సమాచారం తెలుసుకున్న టోని బ్లెయిర్ దీని పై ఆసక్తి ప్రదర్శించారు.
ప్రకృతి విపత్తులను ఆంధ్రప్రదేశ్ సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ముచ్చటగొలిపిందన్నారు. . సీఎం ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని, ఆర్టీజీఎస్‌ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న విజ యాలు అందరికీ ఆదర్శమని, ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదంటూ కితాబిచ్చారు.

సచివాయలంలో బ్లెయిర్ సందడి..
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఏపి సచివాలయంలో సందడి చేసారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు లోకేష్.. నక్కా ఆనందబాబు ఆయనకు స్వాగతం పలికారు. సచివాలయం చేరుకున్న బ్లెయిర్ కు ముఖ్యమంత్రి ఆహ్వా నం పలికారు. సీయం స్వయంగా ఆయన్ను రియల్ టైం గవర్నెన్స్ కేంద్రానికి తీసుకెళ్లారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో ఆయన్ను కలిసి ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించానని... ఆయన ఇక్కడికి రావడం, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ గ్లోబల్‌ఛేంజ్ కోసం పనిచేయడం ఆనందంగా ఉంన్నారు సీయం చంద్రబాబు. అవేర్ విభాగం ద్వారా ప్రకృతి విపత్తులను, భూగర్భ జలాలను రియల్‌టైంలో పర్యవేక్షిస్తున్నామన్నారు.. 1100 కాల్ సెంటర్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి..తమ పని తీరును బ్లెయిర్ కు వివరించారు.












Click it and Unblock the Notifications