ఏపి ఆర్దిక మూలాల పై దాడి : సోదాల పేరుతో దొంగతనం చేస్తారా : బాబు సంచలనం..!
Recommended Video

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రం..తెలంగాణ ప్రభుత్వం..జగన్ పై మండి పడ్డారు . తెలంగాణలో ఏపి పారిశ్రామికవేత్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రయివేటు సంస్థల పై దాడులు చేసి సోదాల పేరుతో డేటాను దొంగతనం చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానిది ఆర్దిక ఉగ్రవాదం గా సీయం అభివర్ణించారు. తన ప్రాణాలైనా ఇస్తాం కానీ..రాజీపడనని తేల్చి చెప్పారు.

వాళ్లది ఆర్దిక ఉగ్రవాదం
తెలంగాణ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ..తెలంగాణ సీయం కేసీఆర్..వైసిపి అధినేత జగన్ ముగ్గూరు కలిసి ఏపి పై దాడి చేస్తున్నరన్నారు. ప్రశ్నించే వారి పై ఐటి దాడులు చేయి స్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ఏపి పారిశ్రామికవేత్తలకు రక్షణ లేకుండా పోయిందని..దాడులు చేసి భయ పెడుతున్నారని విమర్శించారు. వాళ్ల అరాచకాలు తమ పై పని చేయవని చెప్పుకొచ్చారు. దాడుల తో మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. కార్పోరేట్ వ్యక్తులను భయపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానిది ఆర్దిక ఉగ్ర వాదమని తీవ్ర ఆరోపణ చేసారు. తెలంగాణ లో ఎన్నికల సమయంలో ఏం చేసారు..ఏం జరిగిందో అందరికీ తెలుసని.. ఆ పరిస్థితే ఇప్పుడు ఏపి లో చేయాలని చూస్తున్నారా అని సీయం ప్రశ్నించారు.

మా డేటా దొంగిలించి వైసిపికి ఇస్తారా
మా పార్టీకి సేవలు అందించే ఓ ప్రయివేటు కంపెనీ పై దాడి చేసి సోదాల పేరుతో డేటాను దొంగతనం చేస్తారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఆ సమాచారం వైసిపికి ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ లో ఏపి డిజిపి కి భద్రత లేదని..ముఖ్యమంత్రికి భద్రత లేదని ఆరోపించారు. పోలీసుల వైఖరి కారణంగా సంస్థలో పని చేసే 160 మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఏ అధికారంతో దాడులు చేసారని నిలదీసారు. దొంగతం చేయటమే కాకుండా మా పై కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అభివృద్దిలో తమతో పోటీ పడలేరని..క్రిమినల్ వ్యవ హారాల్లో తాను వారితో పోటీ పడలేనని సీయం వ్యాఖ్యానించారు. ఏపిలో జగన్ ను బలోపేతం చేసి సామంతరాజుగా చేయాలని చూస్తున్నారని..కప్పం కూడా కట్టించుకుంటారని దుయ్యబట్టారు.

జగన్ అధికారంలోకి వస్తే..ఇక..
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంత క్రిమినల్ మైండ్ ను ప్రయోగిస్తున్నారని..ఇక వారు అధికారంలోకి వస్తే ఏపి ప్రజలను దోచుకుంటారని సీయం ఆరోపించారు. కేంద్రం నమ్మించి మోసం చేసందని..వారితో తెలంగాణ ప్రభుత్వం కలిసి..జగన్ ను అధికారంలోకి తెచ్చేందుకు ముగ్గూరూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు తోడుగా ప్రశాం త్ కిషోర్ ఏపి పై బందిపోటులా పడ్డాడని సీయం ఫైర్ అయ్యారు. ఏపిలో బీహార్ రాజకీయాలు చేసి అతలాకుతలం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఇటువంటి ప్రయత్నాలు సాగనీవ్వనని..ఎంత దూరమైనా వెళ్తానని సీయం హెచ్చరించారు. గత గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఏపికి అన్యాయం చేయనీయనని స్పష్టం చేసారు. రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గవర్నర్ వ్యవస్థ పై మరోసారి వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications