టీడీపీలో భంగపాటు..జనసేనలో టికెట్ః జాబితాలో టీటీడీ మాజీ ఛైర్మన్‌కు చోటుః ఎస్పీవై రెడ్డి కూడా
అమరావతిః జనసేన పార్టీలో అయిదు జాబితా విడుదలైంది. బుధవారం రాత్రి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ జాబితాను విడుదల చేశారు. నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచే ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి టీడీపీకి గుడ్‌బై చెప్పి, జనసేన పార్టీలో చేరారు. ఆయనకు తిరుపతి అసెంబ్లీ టికెట్ దక్కింది. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు గుంతకల్లు అసెంబ్లీ టికెట్ కేటాయించారు.
ఈ ముగ్గురూ నాయకులు కూడా టీడీపీలో టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేసి, భంగపడ్డ వారే. మధుసూదన్ గుప్తాకు టీడీపీ టికెట్ ఇప్పించడానికి స్వయంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాబీయింగ్ చేసినప్పటికీ..ఫలితం రాలేదు. దీనితో ఆయన జనసేన పార్టీలో చేరిపోయారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఉదంతం మనకు తెలిసిందే. టికెట్ కోసం ఆయన అమరావతికి అనేక సార్లు చక్కర్లు కొట్టినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. దీనితో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

లోక్ సభ అభ్యర్థులు
విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు
కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు
గుంటూరు: బి.శ్రీనివాస్
నంద్యాల: ఎస్.పి.వై.రెడ్డి
తెలంగాణ
మహబూబాబాద్: డాక్టర్ భూక్యా భాస్కర్ నాయక్
శాసనసభ అభ్యర్థులు
సాలూరు: బోనెల గోవిందమ్మ
పార్వతీపురం : గొంగడ గౌరీ శంకరరావు
చీపురుపల్లి: మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం: డాక్టర్ పెదమజ్జి హరిబాబు
బొబ్బిలి: గిరదా అప్పలస్వామి
పిఠాపురం: మాకినీడు శేషుకుమారి
కొత్తపేట: బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం: పోలిశెట్టి చంద్రశేఖర్
జగ్గంపేట: పాటంశెట్టి సూర్యచంద్ర రావు
నూజివీడు: బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
మైలవరం: అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
సత్తెనపల్లి: వై వెంకటేశ్వర రెడ్డి
పెదకూరపాడు: పుట్టి సామ్రాజ్యం
తిరుపతి: చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి: వినుత నగరం
గుంతకల్లు: మధుసూదన్ గుప్తా












Click it and Unblock the Notifications