అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సజ్జల-సాయిరెడ్డి మీట్.. ఏం చర్చించారంటే, కొత్త లుక్‌లో ఎంపీ

|
Google Oneindia TeluguNews

సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి.. వైసీపీలో కీలక నేతలు. ఇద్దరు పార్టీ వ్యవహారాలను చూస్తుంటారు. అయితే వీరిద్దరూ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ అంశాలపై డీప్ డిస్కషన్ చేశారట. సజ్జలతో భేటీ అయ్యానని సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికలకు సమయం ఉన్నా.. పార్టీని బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై డిస్కస్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది.

సజ్జల- సాయిరెడ్డి

సజ్జల- సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి తొలిసారిగా ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. వీరిద్దరూ వైసీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొందారు. కీలక అంశాలపై చర్చలు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. 151 మంది ఎమ్మెల్యేలు, 24 మంది నియోజకవర్గ ఇంఛార్జిలతో ప్రతీ రోజూ సజ్జల టచ్‌లో ఉంటారు. 26 జిల్లాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి మంతనాలు జరుపుతారు.

 రోజూ టెలి కాన్ఫరెన్స్

రోజూ టెలి కాన్ఫరెన్స్


అయితే వీరిద్దరూ నేతలూ రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇప్పుడు కలవడంతో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే అంశం క్యురియాసిటీ పెంచింది. ఈ నెల 10వ తేదీ నుంచి గడప గడపకి కార్యక్రమంపై పార్టీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరు మీట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని మరింత బలోపేతం చేయడంపై వారి చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం.

కొత్త లుక్‌లో సాయిరెడ్డి

కొత్త లుక్‌లో సాయిరెడ్డి


సమావేశం సంగతి అలా పక్కన పెడితే.. విజ‌య‌సాయిరెడ్డి కొత్త లుక్‌లో క‌నిపించారు. ఆయ‌న గుండు లుక్‌లో ఆగుపించారు. గుండు చేయించుకుని కొత్త లుకులో విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టివరకు క‌నిపించ‌లేదు. ఈ లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. డిఫరెంట్‌గా కనిపించారు కూడా. ఇటు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో భేటీకి సంబంధించిన విష‌యాన్ని సాయిరెడ్డి తెలిపారు. స‌జ్జ‌ల‌తో తాను భేటీ అయిన ఫొటోను ట్వీట్‌ చేశారు.

చెప్పినట్టే చేసి..

చెప్పినట్టే చేసి..


ముందుగా చెప్పినట్టు సీఎం జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేశారు. కొత్త వారికి అవకాశం కలిగింది. పాతవారకు 11 మంది కంటిన్యూ అయ్యారు. మిగతావారు పార్టీ బాధ్యతలను అప్పగిస్తారు. ఇప్పటికే జిల్లా బాధ్యతలను ఇస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సజ్జల, సాయిరెడ్డి మీట్ ఇంపార్టెన్స్ ఏర్పడింది.

English summary
ysrcp mp vijaya sai reddy meets andhra pradesh government advisor sajjala ramakrishna reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X