Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓట్లు పోతున్నాయా?.. ఇకపై ఆ సమస్య లేనట్లే..! ఓటర్ ఐడీలతో మొబైల్ నెంబర్ లింకింగ్

అమరావతి : ఏపీ ఓటర్ల డాటా చోరీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. డాటా కేసును పొలిటికల్ టర్న్ గా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త పరిష్కారం కనిపెట్టింది. ఇన్నాళ్లు లేని మొబైల్ లింకింగ్ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. దీంతో ఓటరు ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించడం ఇకపై కుదరదు.

ఏపీ ఓటర్ల డాటా చోరీ అయిందంటూ ఇటీవల పెద్ద దుమారమే రేగుతోంది. ఇకపై అలాంటి ఆటలకు చెక్ పెట్టేందుకు ఈసీ నడుం బిగించింది. ఇకపై ఓటర్లు తమ మొబైల్ నెంబర్లను ఓటర్ ఐడీకీ లింకింగ్ చేసుకోవచ్చు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మొబైల్ నంబర్ ను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించారు ఈసీ అధికారులు. మొబైల్ నెంబర్ లింకింగ్ తర్వాత.. సదరు ఓటరుకు సంబంధించి ఫారమ్ 7 తో సహా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మేసేజ్ వస్తుంది. దీని ద్వారా సదరు ఓటరు రిక్వెస్ట్ పెట్టాడా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ ఓటరు గనక ఎలాంటి అభ్యర్థన పెట్టకుంటే ఇతరులు ఎవరో కావాలని చేస్తున్నారనే విషయం బయటపడుతుంది.

 voter id epic number linking with mobile number

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఓటర్ కార్డు ఎపిక్ నెంబర్ తో పాటు మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయగానే మొబైల్ నెంబరుకు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తే చాలు.. మీ మొబైల్ నెంబర్, ఓటర్ ఐడీతో లింకింగ్ అయినట్లే. తద్వారా ఓటుకు సంబంధించి మార్పులు చేర్పులు చేసినట్లయితే మొబైల్ నెంబర్ కు అలర్ట్ మేసేజ్ వస్తుంది. దాంతో సదరు ఓటరు జాగ్రత్తపడొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+