• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్ర‌బాబు ఏందిది..! విజ‌య‌వాడ మెట్రో ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..? కేంద్ర ప్ర‌క‌ట‌న‌తో గంద‌ర‌గోళం.!

|
  Vijayawada Metro : Centre Says No Proposal Yet For Metro Rail | Oneindia Telugu

  హైద‌రాబాద్ : ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడుపై కేంద్రం మ‌రో బాంబు విసిరింది. అభివ్రుద్దిలో దూసుకుపోతూ అమ‌రావ‌తిని నంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని చెప్తున్న చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌ల‌కు కేంద్రం బ్రేకులు వేసే ప‌నిలో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. ఏపి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మెట్రో ప్రాజెక్టుకు సంబందించి ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి చేర‌లేద‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివ్రుద్ది శాఖ స్ప‌ష్టం చేయ‌డంతో ప్రభుత్వం అవాక్క‌యింది. వాస్త‌వానికి 2017లోనే విజ‌య‌వాడ మెట్రో రైల్ సంబందించిన సాద్యాసాద్యాల‌ను, అంచ‌నా వ్య‌యాన్ని, రూట్ మ్యాప్ ను9 కేంద్రానికి పంపిన‌ట్టు ఏపి ప్ర‌భుత్వం చెప్పుకొస్తోంది. మ‌రి తాజాగా కేంద్ర స‌హాయ మంత్రి ఎందుకు అలా స్పందించారు..? నిజంగా ఏపి ప్ర‌భుత్వం నుంచి ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి వెళ్లలేదా..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

  విజ‌య‌వాడ మెట్రోరైల్ పై నీలి నీడ‌లు..! ఏపి నుండి ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌న్న కేంద్రం..!!

  విజ‌య‌వాడ మెట్రోరైల్ పై నీలి నీడ‌లు..! ఏపి నుండి ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌న్న కేంద్రం..!!

  విజ‌య‌వాడ మెట్రో కి సంబందించి కీల‌క స‌మాచారం వెలువ‌డింది. విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెట్రో రైల్‌ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మాణానికి తిరిగి ప్రతిపాదన పంపించవలసిందిగా సెప్టెంబర్‌ 2017లోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

  అది టిడిపి ప‌నేనా : చ‌ంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా

  గ‌తంలోనే ప్ర‌తిపాద‌న‌లు పంపాం..! స్ప‌ష్టం చేస్తున్న ఏపి ప్ర‌భుత్వం..!!

  గ‌తంలోనే ప్ర‌తిపాద‌న‌లు పంపాం..! స్ప‌ష్టం చేస్తున్న ఏపి ప్ర‌భుత్వం..!!

  అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని చెప్పారు. మెట్రో రైల్ విష‌యంలో వి.విజయసాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి స్పందిస్తూ "పట్టణ రవాణా అనేది పట్టణాభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగం. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారం. పట్టణ రవాణా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది` అని మంత్రి తెలిపారు.

  రె్ండు కారిడార్ల‌లో మెట్రో రూక‌ల్ప‌న చేసిని ప్ర‌భుత్వం..! ప్ర‌తిపాద‌న‌లు పంపారా లేదా..?

  రె్ండు కారిడార్ల‌లో మెట్రో రూక‌ల్ప‌న చేసిని ప్ర‌భుత్వం..! ప్ర‌తిపాద‌న‌లు పంపారా లేదా..?

  కాగా, ఏపీ స‌ర్కారు మెట్రో రైల్ వివ‌రాలు ఎపుడో వెల్ల‌డించింది. రెండు కారిడార్లుగా రూపొందించి మెట్రో రైల్ రూప‌క‌ల్ప‌న‌లో మొత్తం 24 స్టేషన్లు, కనీస వేగంగా గంటకు 33కిమీ, గరిష్టంగా 80కిమీ ఉండే విధంగా లైన్ల నిర్మాణాన్ని ప్రతిపాదించామ‌ని చంద్ర‌బాబు అధికారుల‌కు వెల్ల‌డించారు. 26కిలోమీట‌ర్ల‌ మేర రెండు కారిడార్లలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు రూ.6,823కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. మొదటి కారిడార్‌లో పెనమలూరు నుంచి బందరు రోడ్డు మీదుగా బస్టాండ్‌కు, రెండో కారిడార్‌లో నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, గుణదల, ఏలూరు రోడ్డు, అలంకార్ ధియేటర్, రైల్వేస్టేషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పోలీస్ కంట్రోలు రూమ్, ఫైర్‌స్టేషన్ మీదుగా బస్టాండ్‌కు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

  కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో సందిగ్ద‌త‌..! ప్ర‌తిప‌క్షం రెచ్చిపోయే అవ‌కాశం..!!

  కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో సందిగ్ద‌త‌..! ప్ర‌తిప‌క్షం రెచ్చిపోయే అవ‌కాశం..!!

  బెంజిసర్కిల్ వద్ద ప్రతిపాదించిన ఫ్లైఓవర్ పై నుంచే మెట్రో రైలు వెళ్లనుంది. ఇక్కడ సుమారు 18మీటర్ల ఎత్తు ఉండేలా డిజైన్ రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ శాఖల నుంచి రావాల్సిన అన్ని రకాల అనుమతులను కచ్చితంగా పదిరోజుల్లోగా వచ్చేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని బాబు ఆదేశాలు మీడియాలో వెలువ‌డ్డాయి. అయితే, తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌తిపాద‌న లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో మెట్రో విష‌యంలో అస్ప‌ష్ట‌త నెల‌కొంది. అస‌లు చంద్ర‌బాబు రూపొందిస్తున్న అభివ్రుద్ది న‌గిషీలు కేంద్ర ద్రుష్టికి వెళ్తున్నాయా..? కాగితాల‌కే ప‌రిమితం అంఉతున్నాయా అనే సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.

  English summary
  Key information is available on Vijayawada Metro. Urban Development Minister Hardeep Singh Puri said in the Rajya Sabha that they had no proposal from the Andhra Pradesh government for construction of Metro Rail in Vijayawada.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X