తొలుత మూర్చపోయింది యనమలే.. బాబు కన్నా ఆయనే: విజయసాయి రెడ్డి
ఏపీలో కొత్త జిల్లాల కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ప్రతిపాదన చేసింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్.. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలే రామకృష్ణుడేనని సెటైర్లు వేశారు. 'రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ వ్యవస్థాపకుడి పేరు వినడానికే ఇష్టపడటం లేదన్నారు. నమ్మకద్రోహి' అని యనమలపై ధ్వజమెత్తారు. 'ఎన్టీఆర్ శాపం వల్లే ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల వరుసగా ఓడిపోతున్నాడని రాష్ట్రమంతా ప్రచారంలో ఉందని' ఎద్దేవా చేశారు.
ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యంతరాలు ఏమో కానీ.. హర్షతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

శ్రీకాకుళం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. ఈ జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విజయనగరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపు కోట, గజపతినగరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా.. ఇంతకుముందు ఉన్నవాటిని కలుపుకొని ప్రకటించారు. అయితే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించారు. దీంతో యనమల షాక్ తిన్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications