Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ .. మా తోలి ప్రాధాన్యం అదే అని తేల్చేసిన జగన్

Recommended Video

    AP special status: ప్రత్యేక హోదా నే మా తొలి ప్రాధాన్యం అన్న జగన్ | Did YCP Rejected BJP'S Offer??

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి బీజేపీ అధినాయకత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బిజెపి ఇచ్చిన ఆఫర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. వైసీపీతో దోస్తీ చెయ్యాలన్న ఉద్దేశంలో భాగంగా లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసిపికి ఇవ్వడానికి బిజెపి ముందుకు వచ్చింది. అయితే, తమకు ఆ పదవి వద్దంటూ జగన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.అందుకు కారణం లేకపోలేదు .

     జగన్ కు బీజేపీ ఆఫర్ ..డిప్యూటీ స్పీకర్ పదవికి నో చెప్పిన జగన్

    జగన్ కు బీజేపీ ఆఫర్ ..డిప్యూటీ స్పీకర్ పదవికి నో చెప్పిన జగన్


    ఒక పక్క రాష్ట్ర ప్రజల డిమాండ్ అయిన ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ ను గట్టిగా వినిపించారు . ఇక ఈ నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎకు ఆ పదవి తీసుకోవడం వల్ల దగ్గరైనట్లు సంకేతాలు వెళ్తాయని, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో దగ్గర అయితే దానివల్ల తనకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    జగన్ తొలి ప్రాధాన్యం ఏపీకి ప్రత్యేక హోదా .. అందుకు ఓకే అంటేనే బీజేపీ ఆఫర్ స్వీకరించేది అని తేల్చేసిన జగన్

    జగన్ తొలి ప్రాధాన్యం ఏపీకి ప్రత్యేక హోదా .. అందుకు ఓకే అంటేనే బీజేపీ ఆఫర్ స్వీకరించేది అని తేల్చేసిన జగన్

    ఏపీ ప్రజల స్వప్నంఏపీకి ప్రత్యేక హోదా .. ఇక జగన్ బీజేపీతో సఖ్యంగా ఉండాలనుకున్నా ప్రత్యేక హోదా ఇస్తేనే అది సాధ్యం. అలాగని జగన్ కు ఎన్డీయేతో గత ప్రభుత్వంలా ఘర్షణకు దిగే ఆలోచన లేదు. కానీ ఎలాగైనా ప్రతేక హోదా సాధించే లక్ష్యంతో ఉన్న జగన్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి జగన్ ఆ పదవి తీసుకోటానికి నిరాకరించారు. ప్రతేక హోదా ఇస్తామని చెప్తే బీజేపీ ఆఫర్ తీసుకోటానికి అభ్యంతరం లేదని చెప్పారు.

    కేవలం సంకేతాలు పంపామని ఆఫర్ చెయ్యలేదంటున్న బీజేపీ .. ఆఫర్ కు నో అంటున్న వైసీపీ

    కేవలం సంకేతాలు పంపామని ఆఫర్ చెయ్యలేదంటున్న బీజేపీ .. ఆఫర్ కు నో అంటున్న వైసీపీ

    ఇక తాము వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని స్పష్టంగా చెప్పలేదని, సంకేతాలు మాత్రమే ఇచ్చామని, వైసిపి ఆసక్తి ఉంటే ఆ పదవి ఇస్తామనే సంకేతాలను పంపించామని బిజెపి నాయకులు అంటున్నారు. ఇక ప్రత్యేక హోదా మాత్రమే తమ ప్రథమ ప్రాధాన్యమని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఎ ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడానికి తాము సిద్దంగా లేమని వైసిపి నాయకులు అంటున్నారు. ఇక వైసిపికి లోకసభలో 22 మంది సభ్యులు ఉన్నారు . ఇక ఆ పార్టీ లోకసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది. వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ఆ పదవిని జెడియు కి ఇవ్వాలనే ఆలోచనలో బిజెపి ఉంది. అయితే, ఆ పదవిని ప్రస్తుతం శివసేన ఆశిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+