అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో అరటితోట మాదిరిగానే.. చిత్తూరులో పొలం దగ్దం.. జగన్‌పై అచ్చెన్న ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం జగన్ రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ విమర్శించింది. కడప సంస్కృతి రాష్ట్రమంతా వ్యాపింపజేయాలని అనుకుంటున్నారని మండిపడ్డింది. చిత్తూరు మాజీ ఎంపీపీ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇష్యూపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చిత్తూరు జిల్లా దిగువ శితివారిపల్లెలో టీడీపీ నేతల పొలాలను దగ్ధం చేయడాన్ని ఖండించారు. రాజకీయ భావజాలాన్ని పక్కనబెడితే వారు కూడా రైతులేనన్న సంగతి గుర్తించాలని అన్నారు. పచ్చని పొలాల్లో నిప్పు పెట్టడం వైసీపీ రాక్షసత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.

జగన్ గుండాలు ఇలా..

జగన్ గుండాలు ఇలా..


పెట్టుబడి పెట్టి కష్టపడి సాగుచేసుకున్న టమోట, మిరప పంటలను జగన్ రెడ్డి గూండాలు తగలబెట్టారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫ్యాక్షన్ బుద్ధిని జగన్ రెడ్డి రాష్ట్ర మంతా ఎక్కిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాకా జగన్ రెడ్డి అమరావతిలో అరటి తోటలు తగలబెట్టించారు. నాడు ఆయన నేర్పిన కుసంస్కారాన్ని నేడు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు అమలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పంట నష్టపోయిన బాధితులకు ప్రభుత్వమే పంట నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

అండ దండ

అండ దండ


అయితే పార్టీ పరంగా భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అన్ని విధాలా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు అన్నారు. కానీ వైసీపీ మాత్రం రాక్షస సంసృతిని వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. జగన్ మాదిరిగానే వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని గుర్తుచేశారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాజకీయం.. రాజకీయమేనని.. దానిని వ్యక్తిగతంగా తీసుకురావడం మంచి పద్దతి కాదన్నారు.

 ఏం జరిగిందంటే..?

ఏం జరిగిందంటే..?


టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన టమోటా పంట అగ్నికి ఆహుతైంది. చేతికి వచ్చిన పంటతో సహా పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. పొలంలో పంట తగలబడడంపై బాధిత రైతు భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. 4 లక్షల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రాజకీయ కక్షతో తమ పొలానికి నిప్పు పెట్టారని భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని స్థానిక వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగతంగా దెబ్బతీశారని బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం జగన్ తీరును తప్పుపట్టారు.

English summary
ysrcp cadre erupted fire in ex mpp andhra pradesh tdp chief Atchannaidu alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X