ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెనుకొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరిగి మండలం, పెనుగొండ, సోమందేపల్లి మండలాలు పూర్తిగా పెను గొండ నియోజకవర్గంలో కలిసాయి. జిల్లాలో టిడిపి కీలక నేత పరిటాల రవి ఇక్కడి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలి చారు. 1995 లో పార్టీ చీలక పరిణామాల అనంతరం ఆయన తిరిగి టిడిపిలో ప్రవేశించిన సందర్భంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసారు. 2004 లో గెలిచిన తరువాత 2005 జనవరి లో అనంతపురం టిడిపి జిల్లా కార్యాలయం వద్ద హత్యకు గురయ్యారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయ న భార్య సునీత గెలుపొందారు.1989 లో గెలిచిన సాన చెన్నారెడ్డి కూడా హత్యకు గురయ్యారు. అప్పుడు జరిగిన ఉప ఎన్ని కల్లో ఎస్ వి రమణారెడ్డి గెలిచారు. ఆ పదవీకాలం పూర్తయిన కొంత కాలానికి ఆయన కూడా హత్యకు గురి అయ్యారు. ఇర, 2009 లోనూ ఇక్కడ టిడిపి నే గెలిచింది.
16 సార్లు ఎన్నికలు జరగ్గా..
పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా..అందులో కాంగ్రెస్ అరు సార్లు, టిడిపి ఎనిమిది సార్లు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్ది బికె పార్దసారధి గెలిచారు. ఆయన ఎంపీగానూ పని చేసారు. జిల్లా టిడిపి లో ఆయన సీనియర్ నేత. ఇక, 2014 ఎన్నికల్లో తిరిగి ఆయనే టిడిపి నుండి పోటీ చేసారు. 2009 లో ఇక్కడి నుండి పోటీ చేసిన ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గంలో 201579 ఓట్లు ఉండగా, అందులో166886 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన పార్ధసారధికి 79798 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన శంకరనారాయణ కు 62878 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది పార్ధసారధి 17415 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత ఇక్కడ వైసిపి నుండి పోటీ చేసిన శంకరనారాయణ హిందూపూర్ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తార ని ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పార్దసారధికి టిటిడి బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు.












Click it and Unblock the Notifications