ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సింగనమల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ సెగ్మెంట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎల్లనూరు, పుట్లూ రు, బి.కె సముద్రం మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. తొలుత 1955,1962 లో పుట్లూరు నియోజకవర్గంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ఒకసారి కాంగ్రెస్..ఒక సారి సిపిఐ గెలిచాయి. సిపిఐ నుండి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి గెలిచారు. ఆయన అనంతపురం నుండి రెండు సార్లు గెలిచారు. సొంత బావ నీలం సంజీవరెడ్డిని ఓడించారు. 1969 లో శాసనసభకు రాజీనామా చేసి విప్లవ ఉద్యమం వైపు వెళ్లారు. సింగనమల నియోజకవర్గంలో కె జయరాం ఇక్కడి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసారు. ఇక్కడ ఒకసారి గెలిచిన రుక్మిణి దేవి గతంలో హిందూపూర్, మడకశిర నియోజకవర్గాల నుండి గెలిచారు.
11 సార్లు ఎన్నికలు..
సింగనమల నియోజకవర్గానికి ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి అయిదు సార్లు, జనతాపార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ది ఒకసారి గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో శైలజానాద్ కాంగ్రెస్ అభ్య ర్దిగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. ఆ రెండు సార్లు టిడిపి మహిళా నేత శమంతకమణి మీద గెలుపొందారు. శమంతక మణి గతంలో కాంగ్రెస్ నుండి గెలిచారు. ఆ తరువాత టిడిపి లో చేరారు. ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆమె కుమార్తె యామినీ బాల ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
204 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గంలో మొత్తం 211289 ఓట్లు ఉండగా, అందులో 176418 ఓట్లు పోలయ్యాయి. కాగా, టిడిపి నుండి పోటీ చేసిన యామినీ బాల కు 86679 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్ది పద్మావతి కి 82095 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది యామినీ బాల 4584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత యామినీ బాల శాసనసభలో విప్ గా ఉన్నారు. గతంలో ఇక్కడ నుండి రెండు సార్లు గెలిచిన శైలజా నాద్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా , కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు.












Click it and Unblock the Notifications