జగన్ ది ఫ్యాక్షన్ సంస్కృతి .. చంపకుండా ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు : జేసీ దివాకర్ రెడ్డి
ఏపీ అనంతపురం జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు టీడీపీ నేత, జేసీ దివాకర్ రెడ్డి టార్గెట్ గా ప్రభుత్వం అస్త్రాలు సంధిది. తాజాగా జేసీ కుటుంబానికి చెందిన 'త్రిశూల్ సిమెంట్' కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ చేస్తున్నమని ప్రభుత్వం చెప్తున్న క్రమంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిది ఫ్యాక్షన్ సంస్కృతి అని జేసీ మండిపడ్డారు.

ఎవరూ చనిపోకపోతే వారిపై పగ పగ అన్నట్లు ప్రభుత్వం తీరు
ఇక తమపై వరుసగా కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగుతుందని రాష్ట్రానికి జరిగిన నష్టంతో పోల్చితే తమకు జరుగుతున్న నష్టం ఇదెంత? నాకేమీ బాధలేదని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరూ చనిపోకపోతే వారిపై పగ పగ అన్నట్లు ప్రభుత్వం తీరు ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రత్యర్ధులను చంపకుండా వాళ్ల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే భార్యా పిల్లలు అడుక్కుతింటే చూసి ఇగో శాంతిస్తుంది అని భగ్గుమన్నారు . ఇదే ఫ్యాక్షనిజం అని జేసీ విరుచుకుపడ్డారు .

కోర్టులో తేల్చుకుంటామని చెప్తున్న జేసీ
ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను నిబంధనలు పాటించలేదని సీజ్ చేసిన వైసీపీ సర్కారు తాజాగా ‘త్రిశూల్ సిమెంట్' కంపెనీ లీజును రద్దు చేసి టార్గెట్ జేసీ బ్రదర్స్ అంటోంది. అయితే జేసీ మాత్రం ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని చెప్తున్నారు . జగన్ ఏం చేసినా, తమకు ఏమీ కాదని ప్రభుత్వం తీసుకున్న చర్యపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించినట్టు చేస్తున్నవి అసత్య ఆరోపణలు అని జేసీ మండిపడ్డారు .

జగన్ ది తాత రాజారెడ్డి మనస్తత్వం , పక్కా ఫ్యాక్షనిస్ట్ .. జేసీ ఫైర్
ఇక అంతే కాదు ముఖ్యమంత్రి జగన్ ది ఆయన తాత రాజారెడ్డి మనస్తత్వమని, పక్కా ఫ్యాక్షనిస్ట్ అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో తమ బస్సులను సీజ్ చేయించారని , బస్సుల సీజ్ విషయంలో కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని జేసీ ఫైర్ అయ్యారు. కోర్టులను కూడా లెక్క చేయని మా వాడికి కంగ్రాట్స్ చెబుతున్నానని వ్యంగ్యంగా, ఒకింత అసహనంగా మాట్లాడారు . చంపకుండా ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications