ఆరు జిల్లాలతో కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ: జేసీ దివాకర్ రెడ్డి సరికొత్త డిమాండ్, వైఎస్‌లా కాదంటూ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. శుక్రవారం ఓ మీడియా ఛానల్‌తో జేసీ మాట్లాడుతూ.. తమకు రాజధానిగా అమరావతే ఆమోదయోగ్యమని స్పష్టం చేశారు.

కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ..

కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ..


రాజధానిని విశాఖపట్నంకు మారిస్తే మాత్రం రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో రాయలసీమ ఏర్పాటు చేయాలని జేసీ దివాకర్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటుకు ఉద్యమం చేస్తామని అన్నారు. అంతేగాక, సంక్రాంతి తర్వాత ఉద్యమ కార్యచరణ కూడా ప్రకటిస్తామని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్‌లా కాదు.. ఈ జగన్..

వైఎస్‌లా కాదు.. ఈ జగన్..

వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా పాలన సాగిస్తారన్న నమ్మకంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లిచ్చి అధికారంలో కూర్చోబెడితే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి నమ్మకాన్ని నిలుపుకోలేకపోతున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని జేసీ అన్నారు. దీంతో మిగితా జిల్లాల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.

ఎన్ని కమిటీలు వేసినా.. జగన్ చెప్పిందే..

ఎన్ని కమిటీలు వేసినా.. జగన్ చెప్పిందే..

రాజధాని అంశంపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. రాజధాని అంశంపై ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం ఏమీ ఉండదని, అవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అవే నివేదికల రూపంలో వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అటూ ఇటూ పరుగెత్తాలా..?

అటూ ఇటూ పరుగెత్తాలా..?


రాజధాని అంశంపై జేసీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో రాజధాని పెట్టినందుకే దూరమైందని బాధపడుతుంటే.. ఇప్పుడు మూడు రాజధానులంటూ కొత్త ప్రాతిపాదన తెచ్చారని మండిపడ్డారు. మనిషి శరీరానికి తల ఎంత ప్రధానమైనదో రాష్ట్రానికి రాజధాని అంతే ప్రధానమైందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తల నరికి ఇంకో చోట పెడతా అని సీఎం జగన్ అంటున్నారని.. ఆయన చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలివి నీ ఒక్కడి సొంతం కాదు జగన్.. అందరికీ ఉంటుంది.. నువ్వు అనుకున్నట్లు చేయడం వీలు కాదు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు తలకాయ అక్కడ పెడతా కాళ్లు ఇక్కడు ఉంచుతా.. చెయ్యి ఒక చోట.. కాలు ఒక చోట విసిరిస్తా.. అంటే మా పనుల కోసం ఇక్కడికీ.. అక్కడికీ పరుగుగెత్తాలా? అని జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ సర్కారును నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+