అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన - ఉద్రిక్తత..!!

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. ఆ సమయంలో కొద్ది సేపు ఉద్రిక్తతకు దారి తీసింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. మున్సిపల్ వాహనాల రిపేర్లకు ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ వైఖరిని నిరసనిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు దిగారు. తన తాడిపత్రి కోసం తాను దేనికైనా సిద్దమని ప్రకటించారు.

నిరసనకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి మెడలో ఒక ప్ల కార్దుతో నిరసన ప్రారంహించారు. ఆ కార్డు మీద నా నినాదం - నా అజెండా అని రాసి ఉంది. దీనికి కొనసాగింపుగా క్లీన్ తాడిపత్రి - గ్రీన్ తాడిపత్రి అనే నినాదంతో జేసీ నిరసన ప్రారంభించారు. తాడిపత్రి పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని తాము భావిస్తుంటే కనీసం వాహనాల రిపేర్లకు డబ్బులు కూడా ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధుల కోసం భిక్షాటన చేయాలని నిర్ణయించిన.. ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు దిగారు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. తాడిపత్రిలో భిక్షాటనకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో..ఈ నిరసనను పోలీసులు వెంటనే నిలిపివేసారు.

JC Prabhakar Reddy hold protest At Tadipatri, angry over officials

దీంతో, ఆగ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం వెంటనే వాహనాల రిపేర్లకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేకపోతే, పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద గోచీతో భైఠాయిస్తానని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెలుచుకున్న ఏకైక మున్సిపాల్టీ తాడిపత్రి ఒక్కటేనని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేసారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన తాము తాడిపత్రి అభివృద్ది కోసం పని చేస్తుంటే నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని ఆరోపించారు. తాడిపత్రి కోసం ఏం చేయటానికి అయినా తాను సిద్దమని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ గెలవకపోయినా, స్థానిక ప్రజలు తన మీద నమ్మకం తో గెలిపించారని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా తాడిపత్రిలో రాజకీయం ఊపందుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ లక్ష్యంగా ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజకీయంగా సున్నిత మైన ప్రాంతం కావటంలో నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదు.

English summary
Tadipatri Municipal Chairman JC PRabhakar Reddy protet agsint Govt lead to new tension in the town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X