అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Adimulapu Sureshకు జాబ్ క్యాలెండర్ సెగ- అనంతపురంలో నిరుద్యోగుల నిరసనలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఖాళీలతో జాబ్ క్యాలెండర్ విడుదలను నిరసిస్తూ పలువురు మంత్రుల్ని అడ్డుకున్న నిరుద్యోగులు.. ఇవాళ అనంతపురంలో విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అడ్డుకుని నిరసన తెలిపారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని అనంతపురంలో నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ను అడ్డుకున్న నిరుద్యోగులు .. తమ నిరసన తెలియజేశారు. ఇందులో విద్యార్థి,యువజన సంఘాల నాయకులు ఉన్నారు. నిరసన తెలిపిన వారిలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఎన్ ఎస్ యు ఐ, పిడిఎస్ యు విద్యార్ధి సంఘాల నేతలు ఉన్నారు.

job calender heat to ap ministers, protests at adimulapu suresh convoy in anatapur

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు, రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగతను నిర్మూలిస్తామని, కరువు జిల్లాలో వలసలను నివారిస్తామని గొప్పలు పలకి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన అనంతరం నిరుద్యోగుల జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరుద్యోగులు మండిపడ్డారు. ఇప్పటికే దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు,విద్యార్థి, యువజన సంఘాలు ఆవేదనతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కనీసమైన చలనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటం చాలా బాధాకరం అన్నారు,

ఉద్యమాలు చేసే వారి పైన ప్రశ్నించే తత్వాన్ని అణచి వేయాలనే ధోరణితో ప్రజాస్వామ్యా స్వేచ్ఛను కూని చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఆలోచించి ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు,

Recommended Video

Ys Jagan Anil Kumble Meet, కుంబెకి జగన్నన్న హామీ ! || Oneindia Telugu

English summary
unemployed youth continue protests against ap govt's job calendar across the state. youth hold protests at minister adimulapu suresh's convoy in anantapur today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X