బాబును రూ.5వేలు అడగండి, చిలుకాగోరింకలు అసూయపడేలా: పవన్ కళ్యాణ్‌ను లాగిన జగన్

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలను ఎలా మోసం చేస్తారో, వైసీపీ కార్యకర్తలు అందరూ జనాల్లోకి తీసుకు వెళ్లాలని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలో సోమవారం జరిగిన సమరశంఖారావం సభలో మాట్లాడారు.

అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదే

అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదే

రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, ప్రజల ఆశీర్వాదంతో తాను అధికారంలోకి వస్తే రాజకీయం చూడకుండా, అవినీతి లేని స్వచ్ఛ పాలన అందిస్తామని చెప్పారు. ఇలాంటి పాలన కావాలంటే మీరే (ప్రజలు) క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఎన్నికలు దగ్గరపడ్డాయని, నెలాఖర్లో షెడ్యూల్ వచ్చేలా ఉందని, రెండు మూడు నెలల్లో ఎన్నికలు రానున్నాయన్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదే (ప్రజలు) అన్నారు.

చాలామందికి డబుల్ ఓట్లు

చాలామందికి డబుల్ ఓట్లు

మనం రాక్షసుల పైన యుద్ధం చేస్తున్నామని, అన్యాయంపై యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఓటర్లను తొలగించే ప్రయత్నాలు అధికార టీడీపీ చేస్తోందని చెప్పారు. కాబట్టి దీని పట్ల వైసీపీ కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మీ ఓటు ఉందా లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి చూసుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి మధ్య ఓట్ల శాతం కేవలం 5 లక్షలే అన్నారు. రాష్ట్రంలో 39 లక్షల మందికి రెండు ఓట్లు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈసారి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మన సానుభూతిపరుల ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. చంద్రబాబు అబద్దాలకోరు అన్నారు.

చంద్రబాబు రూ.3వేలు ఇస్తే, రూ.5వేలు అడగండి

చంద్రబాబు రూ.3వేలు ఇస్తే, రూ.5వేలు అడగండి


ఎన్నికలు సమీపిస్తే చంద్రబాబు మూటల కొద్ది డబ్బులు పంపిస్తారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు పథకాలు ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. ఆయన పథకాలు, డబ్బులకు లొంగిపోవద్దని చెప్పారు. ఎన్నికల కోసం చంద్రబాబు చెప్పని అబద్దం లేదన్నారు. అయిదేళ్లలో ఎన్నో అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రూ.3 వేలు ఇస్తే అవి వద్దని చెప్పండని, దానికి బదులు రూ.5వేలు తీసుకోండని, ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాత్రం ఒక్క క్షణం ఆగి ఈ రాక్షసుడికి ఓటు వేయవద్దని వైసీపీకి వేయాలన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు అమ్ముుడుపోవద్దని విజ్ఞప్తి చేశారు. 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చలేదన్నారు. అయిదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు పథకాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు గుడి భూములు, దళితుల భూములు వదిలి పెట్టలేదన్నారు.

పవన్ కళ్యాణ్‌, బీజేపీతో చిలుకా గోరింకలు అసూయపడేలా కాపురం

పవన్ కళ్యాణ్‌, బీజేపీతో చిలుకా గోరింకలు అసూయపడేలా కాపురం

చంద్రబాబు అయిదేళ్లుగా సినిమాలు చూపిస్తున్నాడని జగన్ అన్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీ, పవన్ కళ్యాణ్‌తో కాపురం చేస్తారని, ఎన్నికలకు ఆరు నెలల ముందు, మూడు నెలల ముందు నల్ల చొక్కాలతో నిరసన తెలిపి డ్రామాలు ఆడుతారన్నారు. ఆరు నెలల ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తారన్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో ఉండి, టీడీపీ నేతలు మంత్రులుగా ఉంటారని, పరస్పరం పొగుడుకుంటారని, బీజేపీని పొగుడుకుంటూ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారని, చిలుకా గోరింకలు అసూయపడేలా కాపురం చేశారని, అంత గొప్పగా కాపురం చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం డ్రామాలు ఆడుతారన్నారు. నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా మాట ఎత్తని చంద్రబాబు, ఇప్పుడు నిరసనలు తెలియజేస్తారని ఎద్దేవా చేశారు. హోదా అవసరం లేదని చెప్తారని, హోదా అడిగితే కేసులు పెట్టిస్తారని, ఏపీకి చేసినంతగా మోడీ ఏ రాష్ట్రానికి చేయలేదని చెబుతారని, హోదా సంజీవిని కాదని చంద్రబాబు ఇన్నాళ్లు చెప్పారని, కానీ ఇప్పుడు నల్ల చొక్కాతో ఢిల్లీకి వెళ్లి దీక్ష చేస్తారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+