• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎంపీ మాధవ్ స్నేహ గీతం..! అనంతపురంలో సీఐ ని పక్కన కూర్చోబెట్టుకున్న ఎంపీ..!!

|

అనంతపురం/హైదరాబాద్ : స్నేహానికన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదని చాటి చెప్పారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఉన్నతమైన పోలీసు వృత్తిని వదిలేసి రాజకీయ ప్రవేశం చేసి ఎంపీగా గెలుపొంది చరిత్ర తిరగరాసారు మాధవ్. ఆ తర్వాత రాజకీయాల్లో తన ముద్రను చాటుకుంటూ కీలక ప్రస్ధానాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడూ ప్రత్యర్థులకు ఘాటైన సమాధానాలు చెబుతూనే రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు.

తాజాగా అనంతపురంలో జరిగిన ఓ సంఘటన పట్ల మాధవ్ స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. తాను పోలీసు వృత్తిలో ఉన్నప్పుడు తనతో పాటు సహచరుడుగా ఉన్న మరో పోలీసు అదికారిని పేరుపెట్టి పిలవడమే కాకుండా గట్టిగా ఆలింగనం చేసుకుని వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు మాధవ్. ఈ సంఘటన పట్ల మిగిలిన పోలీసులు ఆశ్ఛర్యానికి గురవ్వగా అదికారుల మాత్రం మాధవ్ స్నేహానికి ఇచ్చిన విలువ పట్ల చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

The MP who sits next to the CI in Ananthapuram..!!

అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. బందోబస్తు గా అనంతపురం రూరల్ సిఐ డి మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమావేశంలో సభ నిర్వాహకులు అతిథులును ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. అంతలోనే బిగ్గరగా ఒక అరుపు.

రేయ్ రారా మురళీధర్ రెడ్డి అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ సి ఐను పిలవడంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం ఆవహించింది. సీఐ మురళీధర్ రావడంతోనే వేదికపైనే గట్టిగా హత్తుకొని నా ప్రాణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏమిటి, నా పక్కన కూర్చో అంటూ ఎంపీ మాధవ్ అతనిని హత్తుకున్నాడు. ఇద్దరూ వేదికపై కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీ పదవి దక్కిన స్నేహం విలువ తెలిసిన గొప్ప వ్యక్తిగా మాధవ్ ను కొందరు ప్రశంసలతో ముంచెత్తారు.

అదే సమయంలో విధి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మురళి మంచి ఇంటలిజెంట్ అని, కాస్తలో ఉన్నతోద్యోగాలు తప్పిపోయినట్లు ఆయన వివరించారు. 1998లో పోస్టింగ్ లభించినప్పుడు నుండి ఇప్పటివరకు తమ స్నేహబంధం కొనసాగుతున్నదని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు.

English summary
Muralidhar Reddy called MP Gorantla Madhav, and suddenly there was silence in the Meeting. When I was on the platform with CI Muralidhar Rao, I hugged my best friend, and the MP Madhav hugged him. Both of them sat on the stage and held legislative initiatives. Some praised Madhav as a great man who knows the value of the friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X