నేడు, రేపు ఏపీ, తెలంగాణాలలో వర్షాలు కురుస్తాయన్న బంగాళాఖాతం!

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదివారం, సోమవారం అక్టోబర్ 18, 19 తేదీలలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం, అలాగే దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితి వచ్చే రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.

AP Telangana Weather Alert Rain and Thunderstorms Expected in Several Districts Over Next Two Days

తెలంగాణలో పరిస్థితి ఇలా..

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్ పరిధిలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

ముఖ్యంగా కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నదులు, వాగులు పొంగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు, ఉరుములు ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర నిలబడకూడదు. వ్యవసాయదారులు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ఏసీలతో కాలుష్యం.. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్.. చెయ్యాల్సిందిదే.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక!
ఏసీలతో కాలుష్యం.. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్.. చెయ్యాల్సిందిదే.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక!

రోడ్లపై నీరు నిలిచి ఉండే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అయితే ప్రజలు అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+