ఏసీలతో కాలుష్యం.. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్.. చెయ్యాల్సిందిదే.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక!

గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏసీల వినియోగం మరో పెద్ద సవాలుగా మారుతోంది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భవనాల లోపల ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఏసీలు విస్తృతంగా వాడుతున్నప్పటికీ, అవి వాతావరణానికి అదనపు భారంగా మారాయి. ఇంధన పొదుపు సామర్థ్యం తక్కువగా ఉన్న ఏసీలు, హైడ్రోఫ్లోరోకార్బన్ శీతలీకరణ వాయువులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ల కారణంగా గ్లోబల్ వార్మింగ్ మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ఒక ఇంట్లో ఏసీ ఉంటే ఆ ఇంటి విద్యుత్ వినియోగం సుమారు 36 శాతం పెరుగుతుందని అధ్యయనం తెలిపింది. 2020లో దేశంలో ఏసీల వాడకం కేవలం 9 శాతం కుటుంబాలకే పరిమితమై ఉండగా, ప్రస్తుతం అది 15 శాతానికి చేరుకుంది. వేడి తీవ్రత, వడగాలులు పెరుగుతున్న కారణంగా 2050 నాటికి ఇది 33 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

AC pollution Rising Air Conditioner Use Fuels Global Warming Warns of Temperature Rise by 2050

ఈ పెరుగుదలను నియంత్రించకపోతే, ఏసీల కారణంగా సగటు ఉష్ణోగ్రత 0.03 నుంచి 0.07 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. భూతాపం 3 డిగ్రీలు పెరిగితే దేశ తలసరి జీడీపీలో 32 శాతం వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏసీల్లో వాడే హెచ్‌ఎఫ్‌సీ వాయువులు ముఖ్యంగా ఆర్-410ఏ వంటివి కార్బన్ డయాక్సైడ్‌తో పోలిస్తే వేల రెట్లు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కలిగి ఉన్నాయి.

ఆర్-410ఏ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 2,088 రెట్లు ఎక్కువ భూతాపం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది. విద్యుత్ వినియోగం కంటే ఈ శీతలీకరణ వాయువుల ఉద్గారాలు వాతావరణాన్ని మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నివేదిక పేర్కొంది. అయితే పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని నివేదిక సూచించింది. 2033 నాటికి కొత్తగా అమ్మే ఏసీలు అధిక ఇంధన పొదుపు నిబంధనలు పాటించేలా చేస్తే, 2035 నాటికి ఏసీల విద్యుత్ వినియోగాన్ని సంవత్సరానికి సుమారు 86 టెరావాట్ గంటల వరకు తగ్గించవచ్చు. ఇది దేశ మొత్తం విద్యుత్ వినియోగంలో 4 శాతానికి సమానం.

ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఏసీలను ప్రోత్సహించడం, పాత మోడళ్లను దశలవారీగా నిలిపివేయడం అవసరం. అలాగే పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా విస్తరించాలని నివేదిక సూచించింది. రూఫ్‌టాప్ సోలార్, పవన విద్యుత్ వంటి వ్యవస్థలను భారీ ఎత్తున పెంచితే పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. భవనాల నిర్మాణంలోనూ మార్పులు రావాలి. లోపలి ఉష్ణోగ్రతలు సహజంగా తగ్గేలా భవన డిజైన్లు, బిల్డింగ్ కోడ్‌లు అమలు చేస్తే ఏసీ అవసరం తగ్గుతుంది.

ఇండియాలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ బిల్డింగ్ నిబంధనలు, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌లు అమలులో ఉన్నాయి. వీటిని మరింత కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఏసీ మార్కెట్లలో ఒకటి. వేసవి కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో ఏసీ లోడ్ కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది.

తెలంగాణాకు కేంద్రం రూ.1,230 కోట్ల ప్రాజెక్టులు.. 5 కొత్త రోప్‌వేలు!
తెలంగాణాకు కేంద్రం రూ.1,230 కోట్ల ప్రాజెక్టులు.. 5 కొత్త రోప్‌వేలు!

ఈ పరిస్థితిని అదుపులో పెట్టాలంటే క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా మారాలి. లేదంటే ఏసీల ఉద్గారాలు పర్యావరణాన్ని మరింత దెబ్బతీస్తాయి. ప్రజలు కూడా ఇంధన సామర్థ్యం ఎక్కువ ఉన్న బి-స్టార్, ఫైవ్-స్టార్ ఏసీలను ఎంచుకోవడం, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించడం, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం వంటి చిన్న చర్యలు తీసుకుంటే తేడా కనిపిస్తుంది.
సమయానుకూల చర్యలు తీసుకుంటేనే భూతాపాన్ని అదుపులో పెట్టవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+