పోలింగ్ కు ముందే ఓటమిని అంగీకరించినట్టే..

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేక, ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదన్న భయంతోనే ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా పోలీసుల అండతో భౌతిక దాడులకు తెగబడుతోందని ఆరోపించారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల వంటి చోట్ల పోలీసులే నేరుగా కార్లపై దాడులు చేయడం అధికార పక్ష కిరాయి సైన్యంలాంటి తీరుకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిష్క్రియాపరంగా మారిపోయిందని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి తమ పాలనపై నమ్మకం ఉంటేప్రజా తీర్పును ఆహ్వానించాలని సవాల్ విసిరారు.

Mockery of democracy YSRCP has condemned local body election nomination process in Andhra Pradesh

వైసీపీ అభ్యర్థులపై జరుగుతున్న దాడులను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అభివర్ణించారు సజ్జల. దేశంలో ఎక్కడా లేని విధంగా నామినేషన్లు వేయడానికి రోజుకు నాలుగు గంటలు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ నాలుగు గంటల్లో కూడా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తే భౌతికంగా అడ్డుకుంటున్నారని అన్నారు. నామినేషన్ కేంద్రాలను సీసీ కెమెరాలు కూడా లేని చిన్న చిన్న పాఠశాలల్లో పెట్టారని, టీడీపీ గూండాలు తిష్టవేస్తే పోలీసులు వారికి రక్షణగా నిలుస్తోన్నారని ఆరోపించారు.

కాలినడకన దుర్గగుడికి వెళ్తోన్న భక్తులపై దూసుకెళ్లిన ట్రక్: 13 మంది దుర్మరణం
కాలినడకన దుర్గగుడికి వెళ్తోన్న భక్తులపై దూసుకెళ్లిన ట్రక్: 13 మంది దుర్మరణం

వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు పట్టుకుని వెళ్తే పోలీసులే బలవంతంగా బయటకు నెట్టేస్తోన్నారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం పూర్తిగా డమ్మీగా మారిపోయిందని, పోలీసులే సర్వాధికారులుగా చెలరేగిపోతున్నారని విమర్శించారు. ఎస్ఈసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే.. దాన్ని డీజీపీకి పంపిస్తోన్నారని అవి బుట్టదాఖలవుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులే అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని చెప్పారు.

టీటీడీ ఈ-డిప్, రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ తేదీలు వెల్లడి
టీటీడీ ఈ-డిప్, రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ తేదీలు వెల్లడి

కూటమి పాలన బ్రహ్మాండంగా ఉందని నమ్మకం ఉంటే వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేసి, ప్రచారం చేసుకోనివ్వాలని.. పోలింగ్ బూత్‌లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో తేల్చుకుందామని సజ్జల సవాల్ చేశారు. లేదంటే ముందే ఓటమిని అంగీకరించాలని అన్నారు. టీడీపీ కూటమి ఎన్ని దాడులు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా వైసీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకునే ధైర్యం ఉందని స్పష్టం చేశారు.

పుంగనూరులో మిథున్‌రెడ్డి, తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వెంట వచ్చిన అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారని సజ్జల గుర్తు చేశారు. రాయచోటిలో పార్టీ కార్యాలయంపైనే పచ్చ గూండాలు పడి విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. గురజాలలో అభ్యర్థులను కిడ్నాప్ చేశారని, బద్వేలులో అధికారులు చూస్తుండగానే టీడీపీ మూకలు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కట్టలతో సహా లాక్కెళ్లారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+