అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏమీ నిర్లక్ష్యం.. 13 గంటల బెడ్‌పై రోగి మృతదేహం, కలెక్టర్ ఆగ్రహాంతో సిబ్బందిలో కదలిక..

|
Google Oneindia TeluguNews

వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు. వైద్యులను దేవుడితో పోలుస్తారు. కానీ కొన్నిచోట్ల ఆడపా దడపా నిర్లక్ష్య ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ రోగి చనిపోయినా.. ఆమెను పట్టించుకునే నాథుడే లేడు. అలా మృతదేహాం గంట కాదు రెండు గంటలు కాదు 13 గంటలు అలానే బెడ్ మీదే ఉంది. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది.

ప్రభుత్వ ఆస్పత్రి కోవిడ్-వార్డులో వైద్య సిబ్బంది తక్కువ మంది ఉన్నారు. కరోనా వైరస్ రోగులను పట్టించుకునే వారు లేదు. దీంతో ఆస్పత్రిలో ఓ మహిళ చనిపోయారు. కానీ సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దవాఖానలో రోగి చనిపోతే పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. మార్చురీకి తరలించానలి.. తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించాల్సిన సంగతి మరచిపోయారా అని మండిపడుతున్నారు. విధుల్లో అలసత్వంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

woman deadbody is 13 hours in anantapur hospital..

మరోవైపు దవాఖానలో పరిస్థితిని ట్రైనీ కలెక్టర్ సూర్య సమీక్షించారు. మహిళ మృతదేహం ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరుపై మండిపడ్డకా కానీ.. సిబ్బంది కళ్లు తెరవలేదు. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బంధువులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే ఉపేక్షించబోము అని సూర్య హెచ్చరించినట్టు తెలుస్తోంది.

English summary
bizarre incident at anantapur city. a woman dead body stayed 13 hours in anantapur hospital bed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X