ఏపీలో 1500కిపైగా కరోనా కేసులు, 16 మరణాలు: పెరిగిన రికవరీ, జిల్లాలవారీగా కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 2వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 69,088 నమూనాలను పరీక్షించగా.. 1535 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. అంతకుముందు రోజు కంటే కరోనా కొత్త కేసులతోపాటు టెస్టులు కూడా తగ్గాయి.

ఏపీలో కొత్తగా 1535 కరోనా కేసులు, 16 మంది మృతి

ఏపీలో కొత్తగా 1535 కరోనా కేసులు, 16 మంది మృతి

తాజాగా నమోదైన 1535 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,92,191కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 16 మంది మృతి చెందారు.

చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించగా.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,631 మృతి చెందారు.

ఏపీలో 18,210 యాక్టివ్ కేసులు

ఏపీలో 18,210 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2075 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,60,350కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 18,210 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,55,95,959 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు జిల్లాలో 8 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 31, చిత్తూరులో 237, తూర్పుగోదావరిలో 299, గుంటూరులో 173, కడపలో 39, కృష్ణాలో 109, కర్నూలులో 08, నెల్లూరులో 211, ప్రకాశంలో 107, శ్రీకాకుళంలో 54, విశాఖపట్నంలో 65, విజయనగరంలో 25, పశ్చిమగోదావరిలో 177 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,82,389, చిత్తూరులో 2,34,871 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,776) కరోనా కేసులున్నాయి. మరోవైపు ఆగస్టు 16 నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిబంధనలను పాటిస్తూనే తరగతులు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు 90 శాతం వరకు వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసుల్లో క్షీణత నమోదు

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసుల్లో క్షీణత నమోదు

ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 478 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు పెరిగింది.

కాగా, కరోనా మహమ్మారి నుంచి శుక్రవారం 35,743 మంది కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం కోలుకున్న వారిసంఖ్య 3,13,38,088కి పెరిగింది. ఇక దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కాగా గురువారం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితోపోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువని ప్రభుత్వం తెలిపింది.ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.45 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 1.21 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 22,29798 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం దేశంలో 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. కేరళ మాత్రం మహమ్మారి వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 20,452 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 36,52,090కు పెరిగింది. కేరళలో శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 114 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 18,394కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కేరళలో 16,856మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 34,53,174కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,80,002గా ఉంది. కాగా, కేరళలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 14.35శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో లక్షా 42వేల నమూనాలను పరీక్షించగా పాజిటివిటీ రేటు 14.35శాతంగా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. మలప్పురంలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 3010 కేసులు నమోదు కాగా, కొళికోడ్‌లో 2426, ఎర్నాకులంలో 2388 కేసులు వెలుగు చూశాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంతోపాటు ట్రాకింగ్‌ వ్యవస్థను కూడా పకడ్బందీగా చేపడుతున్నట్లు వీణా జార్జ్‌ స్పష్టం చేశారు. కేరళ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలోనూ వెయ్యికిపైగా కరోనా కేసులు 1500కుపైగా నమోదవుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+